Police Constable Final Exam: కానిస్టేబుల్ పోస్టుల తుది పరీక్ష
ABN , Publish Date - May 23 , 2025 | 06:03 AM
జూన్ 1న రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు 6,100 కానిస్టేబుల్ పోస్టుల తుది రాత పరీక్ష నిర్వహించనుంది. నేటి నుంచి ఏపీఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టిక్కెట్లు డౌన్లోడ్ అందుబాటులో ఉంటాయి.
నేటి నుంచి హాల్‌టిక్కెట్లు: పీఆర్‌బీ చైర్మన్ మీనా
అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): 6,100 పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు జూన్ 1న తుది రాత పరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వెల్లడించింది. దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షల్లో అర్హత సాధించిన 38,910 మంది తుది రాత పరీక్షకు అర్హత పొందినట్లు తెలిపింది. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ పరీక్షను జేఎన్‌టీయూ ద్వారా నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. అభ్యర్థులు ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈనెల 31 వరకు హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పీఆర్‌బీ చైర్మన్ మీనా ఒక ప్రకటనలో సూచించారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో 9441450639 లేదా 9100203323 నంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చన్నారు.