Share News

Nara Lokesh: రెండేళ్లలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు

ABN , Publish Date - Mar 20 , 2025 | 03:40 AM

ఉపాధ్యాయుల బదిలీల చట్టం ద్వారా కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతోందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. రెండేళ్లలోనే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తామని చెప్పారు.

Nara Lokesh: రెండేళ్లలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు

  • ఉపాధ్యాయుల బదిలీల చట్టం చరిత్రాత్మకం

  • ఇక పారదర్శకంగా టీచర్ల సీనియారిటీ జాబితా

  • వైసీపీ హయాంలో అడ్డగోలుగా బదిలీలు: లోకేశ్‌

  • బిల్లుకు ఉభయ సభల ఆమోదం

అమరావతి, మార్చి 19(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీల చట్టం ద్వారా కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతోందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. రెండేళ్లలోనే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల క్రమబద్ధీకరణ చట్టం-2025 బిల్లును శాసనసభ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన మంత్రి లోకేశ్‌ మాట్లాడారు. ‘చంద్రబాబు ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తోంది. 2017లో సరికొత్త మార్గదర్శకాలను రూపొందించుకుని ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీలు నిర్వహించారు. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, పురపాలక పాఠశాలలకు సొంత మార్గదర్శకాలు ఉన్నాయి. వీటిపై అనేక కోర్టు కేసులు, కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవాల్సి వస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల బదిలీలకు ఏకీకృత చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించాం’ అని మంత్రి లోకేశ్‌ వివరించారు.


గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యం

‘గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో కూడా 1100 మంది ఉపాధ్యాయులను ఏకపక్షంగా బదిలీ చేశారు. కొంతమందిపై రాజకీయ కక్షతో కావాలని బదిలీలను నిలిపివేశారు. గడచిన ఐదేళ్లలో అనేక సమస్యలు రావడంతో కోర్టు జోక్యం చేసుకుని అక్రమ బదిలీలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయ బదిలీల్లో రాజకీయ జోక్యాన్ని నివారించి, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ చట్టాన్ని రూపొందించాం. గత ప్రభుత్వంలో మాదిరిగా కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా చట్టాలను రూపొందించడం లేదు. బిల్లును రూపొందించే ముందు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాం. చివరికి వైసీపీకి చెందిన ఉపాధ్యాయ సంఘ నేతలతో కూడా చర్చలు జరిపి వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. ఉపాధ్యాయుల నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 7,735 సలహాలు వచ్చాయి. పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను కూడా పరిశీలించాం. ఉపాధ్యాయ బదిలీల మార్గదర్శకాలను అందరికీ అందుబాటులో ఉంచాం. పారదర్శక విధానంలో ఉపాధ్యాయుల సీనియారిటీని తెలుసుకోవచ్చు. పదోన్నతులను కూడా అంతే పారదర్శకంగా కల్పిస్తాం. అందరికీ ఆమోదయోగ్యమైన విధానంలో నూరు

12 లక్షల మంది విద్యకు దూరం

  • వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్‌లో తగ్గిన విద్యార్థుల సంఖ్య

  • నాటి మంత్రి బొత్స జవాబు చె ప్పాలి: లోకేశ్‌

వైసీపీ హయాంలో ఎంతమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారో డేటా లేదని, దీనికి నాటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలని మంత్రి లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్‌లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారని చెప్పడంపై బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. ఆ సంఖ్య ఎక్కడి నుంచి తెచ్చి చెబుతున్నారని ప్రశ్నించారు. దీంతో లోకేశ్‌, బొత్సల మధ్య మాటల యుద్ధం నడిచింది. ‘ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్‌లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారనే వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నా. బొత్స మంత్రిగా ఉన్నప్పుడు పాఠశాల విద్యలో ఎంతమంది ఉన్నారో లెక్కలు చెప్పాలి. దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నా. విద్యార్థులు ఎక్కడ తగ్గారు, వారంతా ఎక్కడికి వెళ్లారు? ఏ ప్రైవేటు పాఠశాలల్లో సంఖ్య పెరిగిందో చెబుతా. బొత్స టోఫెల్‌ గురించి మాట్లాడుతున్నారు. నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే చూస్తే 2017లో ఇంగ్లీ్‌షలో దేశంలో మన రాష్ట్రం నాల్గవ స్థానంలో ఉంది. వైసీపీ హయాంలో 14వ స్థానానికి పడిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో సీటు కావాలని, సిఫారసు చేయాలని ఎప్పుడైతే తల్లిదండ్రులు.. ప్రజాప్రతినిధులను అడుగుతారో అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెరిగాయనే నమ్మకం ఏర్పడుతుంది. దీనిని చాలెంజ్‌గా తీసుకుని, రెండేళ్లలో చేసి చూపిస్తాం’ అని లోకేశ్‌ చెప్పారు. కాగా, 2014-19 వరకు పాఠశాలల్లో ఏ సౌకర్యాలు ఉన్నాయో, తమ హయాంలో ఏ సౌకర్యాలు కాల్పించామో చర్చకు సిద్ధమని, అవసరమైతే ఒక స్టడీ టూర్‌ పెడితే రావడానికి, చర్చించడానికి తాము సిద్ధమేనని బొత్స అన్నారు.


ఒక్క పాఠశాలనూ మూసేయం

రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకువస్తామని లోకేశ్‌ చెప్పారు. జీవో 117 వల్ల 10,49,596 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారన్నారు. జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకువస్తామని, రాష్ట్రంలో ఒక్క పాఠశాలను కూడా మూసివేయబోమన్నారు. హిందీ.. తప్పనిసరని కేంద్రం చెప్పలేదు ‘హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. మాతృభాషను ప్రోత్సహించి, కాపాడుకోవాలని చెప్పింది. స్థానిక భాషతోపాటు హిందీ, ఇతర భాషలు నేర్చుకుంటే బాగుంటుందని కేంద్రం తెలిపింది’ అని లోకేశ్‌ అన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 03:40 AM