AP News: సాక్షి మీడియాని రద్దు చేయాలి.. తెలుగు మహిళలు నిరసన
ABN , Publish Date - Jun 10 , 2025 | 07:43 PM
సాక్షి ఛానల్ డిబేట్‌లో అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అమరావతిని వేశ్యల నగరంగా కృష్ణంరాజు అభివర్ణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగు మహిళలు నిరసనలు తెలిపారు.

సాక్షి ఛానల్ డిబేట్‌లో అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అమరావతి (Amaravati)ని వేశ్యల నగరంగా కృష్ణంరాజు అభివర్ణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగు మహిళలు నిరసనలు తెలిపారు. సాక్షి మీడియాను తక్షణమే రద్దు చేయాలని విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయం ఎదురుగా ధర్నాకు దిగారు.
రాష్ట్ర మహిళలందరికీ తక్షణమే సాక్షి మీడియా యాజమాన్యం క్షమాపణ చెప్పాలని విశాఖలో ప్లకార్డులు ప్రదర్శించారు. రాజధాని అమరావతి, మహిళలపై జర్నలిస్ట్‌లు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలుగు మహిళలు ఖండించారు. అలాగే అనకాపల్లిలో కూడా వైసీపీకి వ్యతిరేకంగా తెలుగు మహిళలు నిరసన తెలిపారు. అనకాపల్లి నెహ్రూచౌక్ జంక్షన్‌లో సాక్షి దినపత్రికను తగలబెట్టి నిరసన తెలియజేశారు. అలాగే కోనసీమలోని రామచంద్రపురంలో సాక్షి దినపత్రిక ప్రతులను చెప్పులతో కొట్టి చించివేశారు.
విజయనగరం, బొబ్బిలిలో కూడా వేలాది మంది తెలుగు మహిళలు ర్యాలీలు చేశారు. మహిళలపై గౌరవం లేని సాక్షి ఛానల్ మూసివేయాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి, భారతీరెడ్డి క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. మరోవైపు ఏలూరులో పాత బస్టాండ్ నుంచి ఫైర్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ జరిగింది. జగన్ ,భారతి రెడ్డిలు మహిళలకు క్షమాపణ చెప్పాలని ఏలూరు, దెందులూరు తెలుగు మహిళలు డిమాండ్ చేశారు.
ఏలూరులో సాక్షి భవనం దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. నిరసన సమయంలో సాక్షి ఆఫీస్ ఆవరణలో మంటలు చెలరేగాయి. తాము నిరసనకు వస్తున్నామని తెలిసి కుట్రలో భాగంగానే అగ్ని ప్రమాదం సృష్టించారని తెలుగు మహిళలు ఆరోపించారు. ఇక గూడూరు పట్టణంలో సాక్షి ఛానల్‌కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టి టవర్ క్లాక్ సెంటర్‌లో సాక్షి పత్రికలను తెలుగు మహిళలు దగ్ధం చేశారు.
ఇవి కూడా చదవండి
ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్లీ హాట్ కామెంట్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
Read latest AP News And Telugu News