Share News

AP Metro Rail: మెట్రో రుణ సంప్రదింపులు

ABN , Publish Date - May 15 , 2025 | 04:24 AM

విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు రూ.12వేల కోట్ల రుణం సమీకరించే పనిలో ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఉంది. తక్కువ వడ్డీ రుణాల కోసం వివిధ అంతర్జాతీయ బ్యాంకులతో చర్చలు జరుపుతోంది.

AP Metro Rail: మెట్రో రుణ సంప్రదింపులు

విజయవాడ, విశాఖలకు 12 వేల కోట్లు

పలు బ్యాంకులు ఆసక్తి వ్యక్తీకరణ

ఏఐఐబీ బ్యాంకుతో ఏఎంఆర్‌సీ ఎండీ చర్చలు

అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): విజయవాడ, విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టులపై ఏపీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ వేగంగా అడుగులు వేస్తోంది. రెండు మెట్రో ప్రాజెక్టులకు ఇప్పటికే జనరల్‌ కన్సల్టెంట్‌ నియామకానికి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తాజాగా రుణ సమీకరణపై దృష్టి సారించింది. రెండు మెట్రోల నిర్మాణానికి రూ.12 వేల కోట్ల రుణం... విజయవాడ మెట్రో కోసం రూ.5,900 కోట్లు, విశాఖపట్నం మెట్రో కోసం రూ.6,100 కోట్లు అవసరమవుతుందని అంచనా. తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేసే బ్యాంకులతో ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ రామకృష్ణారెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. మంగళవారం సాయంత్రం బీజింగ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ) ప్రతినిధులు సంతోశ్‌, పాస్కల్‌ రసెల్‌తో విజయవాడలోని తన కార్యాలయంలో రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. సమావేశానికి ముందు బ్యాంకు ప్రతినిధులు విజయవాడలోని ప్రతిపాదిత మెట్రో కారిడార్‌ల మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బస్‌స్టేషన్‌ నుంచి గన్నవరం వరకూ ఉన్న 26 కి.మీ కారిడార్‌ను, బస్టాండ్‌ నుంచి పెనమలూరు వరకు ఉన్న 12 కి.మీ కారిడార్‌ను పరిశీలించారు. కేఎ్‌ఫడబ్ల్యూ బ్యాంక్‌, ఏఎ్‌ఫడీ బ్యాంకు, జైకా బ్యాంకులతో పాటు ఏడీబీ, ఎన్‌డీబీ, ప్రపంచ బ్యాంకులు కూడా రుణం ఇచ్చేందుకు ముందుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. వీటిలో తక్కువ వడ్డీ, మెట్రో ప్రాజెక్ట్‌ త్వరగా పూర్తయ్యేందుకు సహకరించే బ్యాంకులను గుర్తించిన తర్వాత చర్చలు జరపనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్

Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్

Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 15 , 2025 | 04:24 AM