AP JAC: ఉద్యోగుల బకాయిల విడుదల ఎప్పుడు
ABN , Publish Date - May 31 , 2025 | 05:22 AM
ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగుల సర్డర్ లీవ్ డబ్బులు మరియు డీఏ బకాయిలపై ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ రీయింబర్స్మెంట్ సొమ్ములు ఆసుపత్రులకు అందకుండా ఉద్యోగులు చికిత్స పొందలేకపోతున్నారని పేర్కొన్నారు.
అనకాపల్లి, మే 30(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సరెండర్ లీవ్‌ల డబ్బులు రూ.3వేల కోట్లు, బిల్లుల ఆమోదం పొందిన డీఏ డబ్బులు 1,300కోట్లు ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం ఇక్కడి రోటరీ క్లబ్ హాల్‌లో జిల్లా ఉద్యోగుల సంఘ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ సొమ్ము ఆస్పత్రులకు అందడం లేదని, ఉద్యోగులు పేరున్న ఆస్పత్రుల్లో వైద్యం పొందలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. విశాఖకు చెందిన త్రినాథ్ అనే ఉద్యోగి ప్రైవేటు ఆస్పత్రిలో రూ.5లక్షలు ఖర్చుచేసి శస్త్ర చికిత్స చేయించుకుంటే ప్రభుత్వం రూ.90వేలు మాత్రమే విడుదల చేసిందన్నారు. ఇంత పెద్దమొత్తంలో బకాయిలుంటే.. ఉద్యోగులు మాట్లాడకూడదని అనడం సబబు కాదన్నారు. ఈ విషయంపై తమ సంఘం తరపున ప్రభుత్వానికి లేఖ ఇచ్చామన్నారు.
ఇవి కూడా చదవండి
ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు
Read Latest AP News And Telugu News