Share News

AP High Court: సహకరించకుంటే చర్యలు తీసుకోవచ్చు

ABN , Publish Date - May 06 , 2025 | 05:55 AM

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి దర్యాప్తుకు సహకరించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. హెలిప్యాడ్ వద్ద జరిగిన ఘటనపై కేసు నమోదయ్యింది.

AP High Court: సహకరించకుంటే చర్యలు తీసుకోవచ్చు

  • తోపుదుర్తికి నోటీసు ఇచ్చి వివరణ తీసుకోండి: హైకోర్టు

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): రాప్తాడు నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి దర్యాప్తునకు సహకరించకుంటే.. చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు పోలీసులకు స్పష్టం చేసింది. పోలీసుల విధులను అడ్డుకొని, దాడిచేసిన వ్యవహారంలో నమోదైన కేసులో ఆయనకు బీఎన్‌ఎ్‌సఎస్‌ సెక్షన్‌ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండల పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లిఖార్జునరావు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. హెలిప్యాడ్‌ వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై నమోదైన కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ తోపుదుర్తి వేసిన వాజ్యంపై పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.శ్రీరామ్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.

Updated Date - May 06 , 2025 | 05:56 AM