Share News

AP High Court : అది పబ్లిసిటీ కోసం వేసిన పిల్‌

ABN , Publish Date - Feb 23 , 2025 | 05:21 AM

ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా పబ్లిసిటీ కోసమే పిల్‌ వేశారని వ్యాఖ్యానించింది. పేకాటను ఏ క్లబుల్లో అనధికారంగా అనుమతిస్తున్నారు? ఆ క్లబ్బులు నిర్వహిస్తున్నది ఎవరు?

AP High Court : అది పబ్లిసిటీ కోసం వేసిన పిల్‌

  • అనధికార పేకాట క్లబ్‌లపై పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

  • పిటిషనర్‌కు రూ. 50 వేలు జరిమానా

అమరావతి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అనధికార పేకాట క్లబ్‌లను నియంత్రించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)ను హైకోర్టు కొట్టివేసింది. ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా పబ్లిసిటీ కోసమే పిల్‌ వేశారని వ్యాఖ్యానించింది. పేకాటను ఏ క్లబుల్లో అనధికారంగా అనుమతిస్తున్నారు? ఆ క్లబ్బులు నిర్వహిస్తున్నది ఎవరు? ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ను అడ్డుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు ఎవరు? వంటి వివరాలు ఏమీ లేకుండా పిల్‌ దాఖలు చేశారని ఆక్షేపించింది. ఈ పిల్‌ వేసిన విజయవాడకు చెందిన మల్లవరపు లక్ష్మణరావుకు రూ. 50 వేలు జరిమానా వేసి.. రెండువారాల్లో ఏపీ న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని స్పష్టం చేసింది. ఆ సొమ్మును వినికిడి, దృష్టి లోపంతో బాధపడుతున్న చిన్నారుల సంక్షేమానికి వినియోగించాలని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఇటీవల ఇటీవల తీర్పు ఇచ్చింది.

Updated Date - Feb 23 , 2025 | 05:21 AM