AP Hajj Pilgrims: రెండో విడతలో హజ్‌కు 906 మంది
ABN , Publish Date - May 20 , 2025 | 05:42 AM
ఏపీ నుంచి రెండో విడతలో 906 మంది హజ్ యాత్రికులు జెడ్డా ఎంబార్కేషన్ నుంచి హజ్ యాత్ర ప్రారంభించారు. ఈ ఏడాది మొత్తం 1630 మంది హజ్ కు వెళుతున్నట్లు మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు.
అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హజ్ యాత్రికులందరికీ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసి పర్యవేక్షిస్తున్నట్లు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. ఏపీ నుంచి రెండవ విడతలో 906 మంది హజ్ యాత్రికులు హై దరాబాద్ ఎంబార్కేషన్ నుంచి సోమ, మంగళవారాల్లో మూడు విమానాల్లో జెడ్డాకు వె ళుతున్నారు. వీరి కోసం ఏపీ మైనార్టీ మంత్రిత్వశాఖ, హజ్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లకడీకాపూల్‌లోని షా ఫంక్షన్ ప్లాజాలో ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, మైనార్టీ సలహాదారు ఎంఏ షరీఫ్, హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా, హజ్ కమిటీ సభ్యులు తదితరులు జెండా ఊపి రెండో విడత హజ్‌యాత్రను ప్రారంభించారు. యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఈ ఏడాది ఏపీ నుంచి మొత్తం 1630 మంది హజ్‌యాత్రకు వెళ్తున్నట్టు తెలిపారు.