Share News

AP Land Disputes: ఫ్రీ హోల్డ్‌ పై కదలిక

ABN , Publish Date - May 15 , 2025 | 02:40 AM

పేదలు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారంపై మే 20న మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. ఫ్రీ హోల్డ్ భూములపై తేల్చని నిర్ణయంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

AP Land Disputes: ఫ్రీ హోల్డ్‌ పై కదలిక

20న మంత్రివర్గ ఉపసంఘం భేటీ

భూ వివాదాల పరిష్కారంపై చర్చ

ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందన

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా!

అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిరుపేదలు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై సర్కారు స్పందించింది. భూ వివాదాల పరిష్కారంపై చర్చించేందుకు ఈ నెల 20వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. ఈ నేపఽథ్యంలో 20న మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో ఉపసంఘం సమావేశం కానుందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి వెల్లడించారు. ఉపసంఘంలో సభ్యులుగా ఉన్న మంత్రులు, కార్యద ర్శులకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. ఈ సమావేశంలో ఫ్రీ హోల్డ్‌ భూములపై ఏం నిర్ణయం తీసుకోవాలి? అందుబాటులో ఉన్న ప్రత్యామ్నయాలు ఏమిటి? పేదలు, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి తక్షణ చర్యలు చేపట్టాలి? వంటి విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. అసైన్డ్‌, ఇనాం, షరతు గల పట్టా భూముల వివాదాలపై చర్చించి ప్రభుత్వానికి పరిష్కార మార్గాలు సూచించేందుకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ నేతృత్వాన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. మార్చి 19వ తేదీన ఉపసంఘం తొలి సమావేశం జరిగింది.


ఆ తర్వాత ఏప్రిల్‌లో సమావేశం కావాలని అనుకున్నా వివిధ కారణాల వల్ల జరగలేదు. మరోవైపు నిషేధ జాబితా నుంచి తొలగించిన అసైన్డ్‌ భూముల (ఫ్రీ హోల్డ్‌) రిజిస్ట్రేషన్లపై నిషేధాన్ని మరో రెండు నెలల పొడిగిస్తూ రెవెన్యూ శాఖ ఈ నెల 11వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికే ఈ అంశంపై 10 నెలలుగా నిషేధ పొడిగింపు ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి. ఇలా ఇంకెంతకాలం నిషేధాన్ని కొనసాగిస్తారని పేద, సామాన్య రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం ‘నెలలకొద్దీ నాన్చుడు, ఫ్రీ హోల్డ్‌పై ఎటూ తేల్చని సర్కారు’ శీర్షికన వార్తను ప్రచురించింది. 50 సెంట్లు, ఎకరం, రెండు ఎకరాలు ఫ్రీ హోల్డ్‌కు అవకాశం ఉన్న నిరుపేద రైతులు గత పదినెలలుగా సర్కారు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. బడా దొంగలు, భూ అక్రమార్కులను కనిపెట్టి వారి అక్రమ రిజిస్ట్రేషన్లను నిలిపి వేయాల్సింది పోయి తమకు ఇబ్బందులు గురి చేస్తున్నారని ప్రజలు ఆందోళనకు గురవుతున్న విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ వార్తపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఉపసంఘం ఏం చేసిందని అడిగినట్టు సమాచారం. రె ండో సమావేశం జరగలేదని, కాబట్టి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని సీఎంకు అధికారులు నివేదించినట్లు తెలిసింది. ఉపసంఘం వెంటనే సమావేశం అయ్యేలా నిర్ణయం తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ జరగనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్

Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్

Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 15 , 2025 | 02:40 AM