Andhra Pradesh Government: మరోవిడత నామినేటెడ్ పదవులు
ABN , Publish Date - Jul 18 , 2025 | 03:23 AM
కూటమి ప్రభుత్వం మరోవిడత నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది.
66 ఏఎంసీలకు చైర్మన్లు ఖరారు.. 53 టీడీపీ, 9 జనసేన, 4 బీజేపీ
35 మంది మహిళలకు అవకాశం
అమరావతి, జూలై 17(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం మరోవిడత నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. 66 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను నియమించింది. వీటిలో 53 పోస్టులు టీడీపీకి, 9 ఏఎంసీలు జనసేనకు, 4 బీజేపీకి కేటాయించింది. 66 చైర్మన్లలో 17 మంది బీసీలు, 10 మంది ఎస్సీలు, 5గురు ఎస్టీలు, 5 గురు మైనార్టీలు ఉన్నారు. 35 చోట్ల మహిళలకు అవకాశం కల్పించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేశారు. త్వరలో దేవాలయాల కమిటీ చైర్మన్ల నియామకం కూడా చేపట్టనున్నారు.
ఏపీ మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్‌గా పెద్దిరాజు
ఏపీ మత్స్యకార సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్‌గా నర్సాపురం నియోజకవర్గానికి చెందిన కొల్లు పెద్దిరాజును నియమిస్తూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. చైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.