Andhra Pradesh Social Audit: పారదర్శకంగా సోషల్ ఆడిట్
ABN , Publish Date - Jul 18 , 2025 | 05:05 AM
ఆంధ్రప్రదేశ్ సోషల్ ఆడిట్‌లో పారదర్శకత పెంచేందుకు సరికొత్త విధానాలు అవలంభిస్తున్నామని పంచాయతీరాజ్..
సరికొత్త విధానాలు తీసుకొస్తున్నాం
మండలస్థాయి ప్రజావేదిక ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం
ఆడిట్ నివేదికలు ఆన్‌లైన్‌లో: ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్
మంగళగిరిలో ముగిసిన దక్షిణాది రాష్ట్రాల సోషల్ ఆడిట్ సదస్సు
అమరావతి, జూలై 17(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ సోషల్ ఆడిట్‌లో పారదర్శకత పెంచేందుకు సరికొత్త విధానాలు అవలంభిస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్ అన్నారు. సామాజిక తనిఖీ ప్రక్రియపై 16, 17 తేదీల్లో మంగళగిరి వేదికగా తొలి దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయా రాష్ట్రాల సామాజిక తనిఖీ, ఉపాధి హామీ ప్రతినిధులు, రాష్ట్ర స్థాయి సంచాలకులు పాల్గొన్నారు. సామాజిక తనిఖీల్లో అవలంభిస్తున్న ఉత్తమ విధానాలు, తనిఖీల్లో మరింత పారదర్శకత పెంచేందుకు భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణపై సదస్సులో ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా శశిభూషణ్‌కుమార్ మాట్లాడుతూ, దేశంలోనే తొలిసారిగా మండలస్థాయిలో సామాజిక తనిఖీ ప్రజావేదికను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశామని తెలిపారు. గ్రామసభల కేలండర్ నుంచి మండల స్థాయి ప్రజావేదిక వరకు ప్రతి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. సామాజిక తనిఖీల్లో పారదర్శకత పెంచేందుకు ఈ ప్రయత్నం అని పేర్కొన్నారు. సరికొత్త ఆలోచనలు, విధానాలు పంచుకోవడానికి ఇలాంటి సదస్సులు ఎంతో ఉపయోగపడతాయని ఏపీ ఉపముఖ్యమంత్రి ఓఎ్‌సడీ వెంకటకృష్ణ అన్నారు. సామాజిక తనిఖీల్లోని సమస్యలు, వాటి పరిష్కారాలను కేంద్రానికి నివేదించేందుకు ఇలాంటి సదస్సులు దోహదం చేస్తాయన్నారు. సామాజిక తనిఖీల్లో సరికొత్త విధానాలు తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ముందు ఉంటుందని ఏపీ సోషల్ ఆడిట్ డైరెక్టర్ శ్రీకాంత్ చెప్పారు. ఉపాధి హామీ పథకంలో శ్రామికులను కలసి సామాజిక తనిఖీ సమగ్రంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. తాము అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను, ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్రాల ప్రతినిధులు వివరించారు. ఏపీ విధానాలను ప్రశంసించారు. ఈ సదస్సులో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు సుష్మిత ఘటోరి, ఆశిష్ గుప్తా పాల్గొన్నారు. సామాజిక తనిఖీల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండటాన్ని వారు అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్