AP EAMCET: ఈఏపీసెట్ సీట్ల కేటాయింపు వాయిదా
ABN , Publish Date - Aug 05 , 2025 | 06:22 AM
ఈఏపీసెట్ తుది విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు వాయిదా పడింది. స్థానికతపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ
‘స్థానికత’పై హైకోర్టు ఆదేశంతో నిర్ణయం
నేడు వెకేట్ పిటిషన్లు వేయాలని నిర్ణయం
అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ఈఏపీసెట్ తుది విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు వాయిదా పడింది. స్థానికతపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. షెడ్యూలు ప్రకారం తుది విడత సీట్లు సోమవారం కేటాయించాలి. కాగా, హైకోర్టు ఆదేశాలపై మంగళవారం వెకేట్ పిటిషన్ వేయాలని సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయినందున స్థానికత అంశంపై ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. వీటి ప్రకారం ఇంజనీరింగ్ సీటు పొందాలంటే అంతకుముందు నాలుగేళ్లు.. అంటే ఇంటర్మీడియట్, 10, 9 తరగతులు కచ్చితం గా రాష్ట్రంలోనే చదివి ఉండాలి. ఒకవేళ ఈ 4 తరగతు ల్లో ఒక్క ఏడాది బయటి రాష్ట్రంలో చదివినా.. తమ తల్లిదండ్రులు ఏపీలో పదేళ్లు నివసించినట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఆ సర్టిఫికెట్ సమర్పిస్తే వారిని అన్ రిజర్వ్‌డ్ కోటాలో పరిగణిస్తారు. అయితే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తించదు. ఈ తరహా లో తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులు కొంద రు తమను లోకల్‌గా పరిగణించాలంటూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై విచారణ చేసిన న్యాయస్థానం వారిని స్థానికులుగా గుర్తించాలని ఆదేశించింది.