Share News

TDP district committees: త్రిసభ్య కమిటీలతో ముగిసిన చంద్రబాబు సమావేశం..

ABN , Publish Date - Dec 16 , 2025 | 06:51 PM

తెలుగు దేశం పార్టీకి సంబంధించిన జిల్లా కమిటీల ఎంపిక కోసం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. జిల్లా పార్టీ అధ్యక్ష పదవుల విషయం మీడియాలో వచ్చాక తలెత్తిన ఒకట్రెండు అభ్యంతరాలను పున:పరిశీలించాలని చంద్రబాబు సూచించారు.

TDP district committees: త్రిసభ్య కమిటీలతో ముగిసిన చంద్రబాబు సమావేశం..
AP CM Chandrababu Naidu

తెలుగు దేశం పార్టీకి సంబంధించిన జిల్లా కమిటీల ఎంపిక కోసం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. జిల్లా పార్టీ అధ్యక్ష పదవుల విషయం మీడియాలో వచ్చాక తలెత్తిన ఒకట్రెండు అభ్యంతరాలను పున:పరిశీలించాలని చంద్రబాబు సూచించారు. మహిళలకు ప్రస్తుతం ఉన్న 28.4 శాతం ప్రాధాన్యాన్ని 30 శాతానికి పెంచాలని చంద్రబాబు ఆదేశించారు (AP CM news).


జిల్లా కమిటీల కోసం క్యాబినెట్ కూర్పు కన్నా ఎక్కువ కసరత్తు చేశానని సీఎం చంద్రబాబు అన్నారు. రాబోయే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉందని, వారిలో సమర్థవైన నాయకత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులు, కమిటీల ఎంపికలో త్రిసభ్య కమిటీ అద్భుతంగా పనిచేసిందని, నెలాఖరులోపు రాష్ట్ర కమిటీ ప్రకటన ఉంటుందని తెలిపారు (TDP district committees).


ప్రతి మూడు నెలలకు ఒకసారి కమిటీల పనితీరును సమీక్షిస్తానని, పనిచేయని వారిని తొలగించేందుకు కూడా వెనకాడనని చంద్రబాబు హెచ్చరించారు (AP political news). తన దగ్గర నుంచి కార్యకర్త వరకు పార్టీ క్యాలెండర్‌కు అనుగుణంగా పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. జనవరి నుంచి అందరూ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాల్సిందేనని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

కుప్పకూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం.. అసలేం జరిగిందంటే..


ఈ రైతు తన భార్య కోసం వెతుక్కుంటున్నాడు.. ఎక్కడుందో కనిపెట్టండి..

Updated Date - Dec 16 , 2025 | 06:51 PM