Share News

Beach Corridor Buzz: సూర్యలంక వాడరేవు మధ్య బీచ్‌ కారిడార్‌

ABN , Publish Date - May 09 , 2025 | 04:24 AM

సూర్యలంక-ఓడరేవు మధ్య బీచ్‌ కారిడార్‌ అభివృద్ధిపై ఏపీ చాంబర్స్‌ ప్రతిపాదనను రాష్ట్ర పర్యాటకశాఖకు సమర్పించింది. ఈ ప్రాజెక్టు ద్వారా కోస్తా ప్రాంతం మినీ గోవాగా మారే అవకాశముంది

Beach Corridor Buzz: సూర్యలంక వాడరేవు మధ్య బీచ్‌ కారిడార్‌

  • ప్రభుత్వానికి ఏపీ చాంబర్స్‌ ప్రతిపాదన

అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా సూర్యలంక-ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని ఓడరేవు మఽధ్య ప్రత్యేక కోస్టల్‌ బీచ్‌ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య(ఏపీ చాంబర్స్‌) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు చాంబర్స్‌ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు గురువారం రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌కు ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.సూర్యలంక-ఓడరేవు మధ్య సహజసిద్ధమైన తెల్లని ఇసుక తిన్నెలతో ఉన్న 20 కిలోమీటర్ల తీరప్రాంతం ఆతిథ్య పెట్టుబడులకు అనువుగా ఉందని, ప్రీమియం రిసార్ట్‌లకు హాట్‌స్పాట్‌గా మారుతుందని వివరించారు. ఇక్కడ బీచ్‌ రోడ్డును అభివృద్ధి చేసి పాండురంగాపురం బీచ్‌ మీదుగా విజయవాడ, హైదరాబాద్‌లకు అనుసంధానం చేస్తే అనేక హై-ఎండ్‌ రిసార్ట్స్‌తో ఈ ప్రాంతం మినీ గోవాగా అవతరిస్తుందని తెలిపారు.

Updated Date - May 09 , 2025 | 04:24 AM