Land Encroachment: రెచ్చిపోయిన వైసీపీ నేత.. రూ. 5 కోట్ల భూమి కబ్జా
ABN , Publish Date - Dec 07 , 2025 | 12:22 PM
పుల్లంపేట మండలం తిప్పాయపల్లిలో సర్వే నెంబర్ 1094లో ఉన్న 10 ఎకరాల భూమిని వైఎస్సార్ సీపీ నేత సుధాకర్ రెడ్డి కబ్జా చేశాడు. సుధాకర్ రెడ్డి కబ్జా చేసిన ఆ భూమి విలువ 5 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది.
పార్టీ అధికారంలో లేక పోయినప్పటికీ వైఎస్సార్ సీపీ నేతలు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. ఇష్టం వచ్చినట్లుగా కబ్జాలకు పాల్పడుతున్నారు. విలువైన భూముల్ని కాజేస్తున్నారు. తాజాగా, ఓ వైఎస్సార్ సీపీ నేత ఏకంగా పది ఎకరాల భూమిని కబ్జా చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారులను అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ సీపీ నేత సుధాకర్ రెడ్డి కబ్జాలకు తెరతీశాడు.
పుల్లంపేట మండలం తిప్పాయపల్లిలో సర్వే నెంబర్ 1094లో ఉన్న 10 ఎకరాల భూమిని కబ్జా చేశాడు. సుధాకర్ రెడ్డి కబ్జా చేసిన ఆ భూమి విలువ 5 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. కబ్జాకు సంబంధంచిన విషయం తెలుసుకున్న కోడుమూరు ఎమ్మెల్యే ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేశారు. ఎమ్మెల్యే ఫోన్‌తో అధికారులు అప్రమత్తం అయ్యారు. సంఘటనా స్థలానికి వెళ్లారు. ఆరు జేసీబీలను సీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి
పాజీ.. ఒక్కటి తక్కువైంది!.. కోహ్లీ-అర్ష్‌దీప్ ఫన్నీ సంభాషణ వైరల్
గర్భధారణ కోసం ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటించాలా..?