Share News

Anil Kumar Yadav: 6 గంటలు.. 36 ప్రశ్నలు

ABN , Publish Date - Aug 05 , 2025 | 05:20 AM

డీపీ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

Anil Kumar Yadav: 6 గంటలు.. 36 ప్రశ్నలు

  • అనిల్‌ కుమార్‌ యాదవ్‌ను విచారించిన పోలీసులు

  • ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న అనుచిత వ్యాఖ్యలపై ప్రశ్నలు

నెల్లూరు(క్రైం), ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): టీడీపీ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాటల్లో మీకు ఏమర్థమైంది? మీరు ఎందుకు నవ్వారు.’ అని పోలీసులు మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్‌కుమార్‌ యాదవ్‌ను ప్రశ్నించారు. ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏ-2గా ఉన్న ఆయన్ను సోమవారం నెల్లూరు రూరల్‌ డీఎస్పీ కార్యాలయంలో కోవూరు సీఐ సుధాకర్‌రెడ్డి విచారించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు సుమారు ఆరు గంటలపాటు విచారణ సాగింది. పోలీసులు 36 ప్రశ్నలు సంధించారు. పీహెచ్‌డీ అంటే ఏమిటి? బోరుబావి అంటే ఏమిటి? ఏ ఉద్దేశంతో ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడారు. మీ పార్టీ ఆదేశిస్తేనే మాట్లాడారా.. ఇలా అనేక ప్రశ్నలు అడుగగా.. వాటికి అనిల్‌ సమాధానాలు చెప్పడంతోపాటు లిఖితపూర్వకంగానూ రాసిచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కోవూరులో జరిగిన వైసీపీ కార్యకర్తల సభలో ప్రసన్నకుమార్‌రెడ్డి.. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గురించి మాట్లాడుతున్న సమయంలో వేదిక కింద ఉన్న వెయ్యి మంది నవ్వారని..ఈలలు వేశారని.. తానూ అలాగే నవ్వినట్లు చెప్పానన్నారు. ఈ ప్రభుత్వంలో నవ్వడం, చప్పట్లు కొట్టడం కూడా తప్పేనంటే.. రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు కూర్చున్నా, నిల్చున్నా కేసులు పెట్టే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మందు బాబులకు గుడ్ న్యూస్

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

For More AP News and Telugu News

Updated Date - Aug 05 , 2025 | 05:20 AM