AP News: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడమే మా లక్ష్యం: మంత్రివర్గ ఉపసంఘం
ABN , Publish Date - Sep 17 , 2025 | 08:17 PM
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడమే తమ లక్ష్యమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంపై చర్చ జరిగిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు. సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.
అమరావతి: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడమే తమ లక్ష్యమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంపై చర్చ జరిగిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు (BC reservation). ఈ అంశంపై సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మంత్రులు సవిత, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సమావేశ వివరాలను మంత్రులు కొల్లు రవీంద్ర, సవిత వెల్లడించారు (Andhra Pradesh government).
బీసీల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడమే తమ లక్ష్యమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుపై చర్చించామని సవిత పేర్కొన్నారు. బీసీలపై దాడులను నివారించడంతోపాటు వారి రక్షణ కోసం చట్టబద్ధంగా చేయాల్సిన అంశాలపై చర్చించామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బీసీ నేతలు, ప్రజలను వేధించడమే లక్ష్యంగా అక్రమంగా కేసులు పెట్టారని, బీసీలను గత ప్రభుత్వం దారుణంగా హింసించిందని మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు (BC quota policy).
బీసీలకు రక్షణ కల్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని, వారి మాన ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు బీసీ రక్షణ చట్టం తెస్తున్నామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు (reservation update AP). బీసీల రిజర్వేషన్లను చంద్రబాబు 34 శాతానికి పెంచారని, వైసీపీ ప్రభుత్వం ఆ రిజర్వేషన్‌ను 24 శాతానికి తగ్గించిందని అన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పునరుద్ధరణకు ఏం చేయాలనే దానిపై చర్చించామని, దీనిపై న్యాయ పరిశీలన చేసి పకడ్బందీ చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే లోపు రిజర్వేషన్లను పెంచే ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి...
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
మీరు దీర్ఘాయుష్షుతో ఉండాలి.. ప్రధానికి పవన్ బర్త్‌డే విషెస్
Read Latest AP News And Telugu News