Share News

District Information Hubs: జిల్లా కేంద్రాల్లో సమాచార కేంద్రాలు

ABN , Publish Date - May 16 , 2025 | 03:41 AM

ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ జిల్లా కేంద్రాల్లో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. ఇప్పటివరకు రూ.55,486 కోట్ల విలువైన టెండర్లు పిలవడంతో, ఈ ఏడాది లక్ష్యం రూ.600 కోట్లు అని సంస్థ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ తెలిపారు.

 District Information Hubs: జిల్లా కేంద్రాల్లో సమాచార కేంద్రాలు

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని సంస్థ చైర్మన్‌ మన్నవ మోహన కృష్ణ ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వశాఖలన్నింటికీ ఏపీటీఎస్‌ సాంకేతిక సేవలు అందిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ రూ.55,486 కోట్ల విలువైన పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ కోసం టెండర్లను పిలిచాం. ఇది ఏపీటీఎస్‌ మొత్తం ప్రాజెక్టుల విలువ రూ.41,000 కోట్ల కంటే ఎక్కువ. ఏపీటీఎస్‌ ద్వారా ఇ-ప్రొక్యూర్‌మెంట్‌ కింద రూ.110 కోట్ల మేర లావాదేవీలు జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.600 కోట్ల మేర లావాదేవీలను నిర్వహించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం’ అని మోహన కృష్ణ ప్రకటించారు.

Updated Date - May 16 , 2025 | 03:43 AM