Share News

Andhra Pradesh: ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.50 లక్షల వరకు టోకరా!

ABN , Publish Date - Dec 31 , 2025 | 01:19 PM

ఈ మధ్య కాలంలో ఈజీ మనీ కోసం కొంతమంది ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు. ఉద్యోగాలు, అధిక వడ్డీ ఆశలు చూపిస్తూ దారుణంగా మోసాలకు పాల్పపడుతున్నారు. అసలు నిజం తెలిసి బాధితులు లబోదిబో అంటున్నారు.

Andhra Pradesh: ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.50 లక్షల వరకు టోకరా!
Job Scam Andhra Pradesh

సీతంపేట, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): రైల్వే, నేవీ, ఎన్ఎస్ఈఎల్లో ఉద్యోగాలు ఇప్పి స్తానని నమ్మించి సుమారు రూ.50 లక్షలు కాజేసిన వ్యక్తి‌పైన, అతనికి సహకరిం చిన మరో వ్యక్తి‌పైన నాలుగో పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు, బాధి తులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపట్నంకు చెందిన కోట అరుణ కుమార్ ఎంఈఎస్‌లో పనిచేస్తున్న విజయ్ రాజుతో పరిచయం ఉంది. దీంతో విజయ్ రాజు పనిచేస్తున్న రైల్వేస్టేషన్ రోడ్డులో గల ఎంఈఎస్ ఆఫీస్ కి కోట అరుణ కుమార్ వస్తుండేవాడు. అక్కడ కూర్చొని కొంత మంది నిరుద్యోగులకు రైల్వేలో ట్రేడ్మెన్లు, గ్రూప్‌డి, కుకింగ్ విభాగాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించాడు.


కుమారి అనే మహిళ ద్వారా కొంతమందికి ఫోన్లు చేయించేవాడు. ఇలా సుమారు 60 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.30 వేలనుంచి రూ.2 లక్షల వంతున వసూలు చేశాడు. ఆరు నెలల పాటు ఈ వ్యవహారం సాగింది. ఈ నెల 30న ఇంటర్వ్యూలు ఉంటాయని, 31న ఉద్యోగంలో చేరాల్సి ఉంటుందని ముందుగా నమ్మించాడు. రైల్వే ఉద్యోగాల కోసం 13 మంది వద్ద రూ.2 లక్షల చొప్పున, డ్రైవర్ ఉద్యోగాలకు, కుకింగ్ కి రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేశాడు.


మూడు రోజుల నుంచి ఫోను చేసినా, ఎంఈఎస్ ఆఫీస్‌కి వెళ్లినా అరుణ కుమార్ కనిపించకపోవడం, ఫోనుకు రెస్పాండ్ కాక పోవడంతో బాధితులంతా అనుమానం వచ్చి ఆరా తీసి, తాము మోసపోయినట్లు గ్రహించారు. దీంతో బాధితులంతా తాము డబ్బులు చెల్లించిన రసీదులతో నాలుగో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ ఉమాకాంత్ కేసునమోదు చేశారు. మోసానికి పాల్పడిన అరుణ్ కుమార్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read:

ఆ అవార్డుల జాబితాలో హైదరాబాద్ బిర్యానికి చివరి స్థానం

మహిళా హోంగార్డుపై హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్య..

Updated Date - Dec 31 , 2025 | 01:19 PM