Share News

AP Fisheries Department: గ్రామ మత్స్య సహాయకుల హేతుబద్ధీకరణ

ABN , Publish Date - Apr 29 , 2025 | 03:12 AM

గ్రామ మత్స్య సహాయకుల (వీఎఫ్ఏ) హేతుబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్త విధానంలో వీఎఫ్ఏలను పని ఉన్న గ్రామాలకు బదిలీ చేయనున్నారు.

AP Fisheries Department: గ్రామ మత్స్య సహాయకుల హేతుబద్ధీకరణ

అమరావతి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): గ్రామ మత్స్య సహాయకుల ( వీఎఫ్ఏ) పోస్టులు, బదిలీల విషయంలో ఉమ్మడి జిల్లాలను యూనిట్‌గా తీసుకోవాలని ప్రభు త్వం నిర్ణయించింది. పశుసంవర్ధక శాఖతో సంప్రదించి, వీఎ్‌ఫఏ పోస్టులను హేతుబద్ధీకరణ చేయనున్నారు. సచివాలయల క్లస్టర్‌లో ఉన్న వీఎఫ్ఏలను పని ఉన్న గ్రామాలకు మార్చనున్నారు. కొత్త క్లస్టర్‌లో వీఎ్‌ఫఏ పోస్టు లేకపోతే పశుసంవర్ధక సహాయకులను బదిలీ చేస్తారు. ఇన్‌ల్యాండ్‌, మెరైన్‌, ఆక్వాకల్చర్‌ విభాగాల వారీగా సాగు, పని ఉన్న గ్రామాలకే వీఎఫ్ఏలను పరిమితం చేయనున్నారు. వీఎ్‌ఫఏలను మత్స్యశాఖలోని ఏ పోస్టుకూ బదిలీ చేయరాదని నిర్ణయించినట్లు తెలిసింది.

Updated Date - Apr 29 , 2025 | 03:13 AM