Andhra Pradesh: 5న ఉద్యోగుల సంఘం కౌన్సిల్ సమావేశం
ABN , Publish Date - May 15 , 2025 | 03:47 AM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కౌన్సిల్ సమావేశం జూన్ 5వ తేదీన విజయవాడలో నిర్వహించబడుతుంది. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, బకాయిలు మరియు వేతన సవరణపై చర్చలు జరగనున్నాయి.
పోస్టర్ ఆవిష్కరించిన సీఎస్ విజయానంద్
వైసీపీ ప్రభుత్వంలో సమస్యలు పరిష్కరించలేదు: సూర్యనారాయణ
విజయవాడ (వన్‌టౌన్), మే 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కౌన్సిల్ సమావేశం జూన్ 5వ తేదీన విజయవాడలో నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ తెలిపారు. సుమారు 10 వేల మంది ప్రతినిధులతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. కౌన్సిల్ సమావేశానికి హాజరు కావాలని.. సంఘానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ను ఆయన చాంబర్‌లో బుధవారం పలువురు నాయకులతో కలిసి సమావేశం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించిన 15 అంశాలపై నివేదికను విజయానంద్‌కు అందచేసి, ఉద్యోగుల సమస్యలను వివరించారు. జూన్ 5వ తేదీన జరిగే సమావేశానికి తప్పనిసరిగా రావాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు సంబంధించి పలు సమస్యల పరిష్కారానికి హామీలు ఇవ్వటంతో ఆనాడు పలు సంఘాల నాయకులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారని, అయితే ఆ సమస్యలు పరిష్కారం కాలేదని గుర్తు చేశారు. ఓ సంఘం నాయకులు ప్రభుత్వం మారగానే రంగులు మార్చినట్టు సంఘాలు మారారని విమర్శించారు.
2023లో ఉద్యోగుల బకాయిలపై తాము గవర్నర్‌ను కలిస్తే కొన్ని సంఘాల నాయకులు విమర్శించారని తెలిపారు. ఇటీవల శాసనసభలో ఉద్యోగులకు బకాయిలు రూ.25 వేల కోట్లు ఉన్నట్టు ప్రకటించారని, ఆనాడు తాను చెప్పిందే నిజమైందన్నారు. వేతన సవరణ కమిషన్‌కు సిట్టింగ్ లేదా రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో 12 పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలన్నారు. రూ.20 వేల కోట్లకు పైగా ఉన్న పెండింగ్ పీఆర్సీ, డీఏ, ఎస్‌ఎల్‌ఎ్‌సఏపీజీఎల్‌ఐ బకాయిల చెల్లింపునకు కాలపరిమితితో కూడిన రూట్ మ్యాప్‌లు విడుదల చేయాలన్నారు. సీపీఎస్, జీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపటానికి చర్యలు తీసుకోవాలని కోరారు. వాణిజ్య పన్నుల శాఖలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన 80 మంది ఉద్యోగులపై తాను న్యాయ పోరాటం చేస్తున్నానని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News