CM Chandrababu Naidu: పాడి, పౌల్ట్రీ రంగాల్లో నూతన ఆవిష్కరణలు
ABN , Publish Date - May 15 , 2025 | 03:13 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశుసంవర్ధన, పౌలీ్ట్ర రంగాల్లో సాంకేతిక అభివృద్ధి పై దృష్టి సారించి, వాటికి ప్రోత్సాహకాలు అందించే ప్రకటన చేశారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికతలను రైతుల ప్రయోజనానికి వాడాలని తెలిపారు.
అత్యాధునిక టెక్నాలజీతో మెరుగైన ఫలితాలు
వృద్ధిరేటులో పశుసంవర్ధక శాఖది కీలక పాత్ర
రాష్ట్ర జీఎ్‌సడీపీలో 11.23 శాతం వాటా
కోడిగుడ్ల ఉత్పత్తిలో ఏపీదే మొదటి స్థానం
గ్రామాల్లో డెయిరీ షెడ్లపై ట్యాక్స్ రద్దు
లైవ్‌స్టాక్ స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం
పశుసంవర్ధక-టెక్ ఏఐ 2.0లో చంద్రబాబు
అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, పౌలీ్ట్ర రంగాల్లో నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించుకుని మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. గ్లోబ్ ఫోరమ్ ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్(జీఎ్‌ఫఎ్‌సటీ) ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో నిర్వహించిన పశుసంవర్ధకశాఖ-టెక్ ఏఐ 2.0 సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘రాబోయేదంతా టెక్నాలజీ యుగమే. ఏఐతో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్‌ను సమర్థంగా ఉపయోగించుకోగలిగే అభివృద్ధికి గేమ్ చేంజర్‌గా నిలుస్తుంది. ఇప్పటికే టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయ అనుబంధ రంగాల్లో నూతన పరిశోధనలకు శ్రీకారం చుడుతున్న లైవ్‌స్టాక్ స్టార్టప్ కంపెనీలకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలు అందిస్తాం. ఇలాంటి స్టార్టప్ కంపెనీలు పెద్దఎత్తున రావాలి. నిత్యం పరిశోధనలు కొనసాగాలి. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. పౌలీ్ట్ర, టెక్స్‌టైల్స్ తదితర రంగాలు ఇబ్బందుల్లో ఉన్నాయి. వాటిని ఏవిధంగా పరిష్కరించాలో ఆలోచిస్తున్నాం. తగు విధానపరమైన నిర్ణయాలు తీసుకుని పాడి, పౌలీ్ట్ర రంగాలను లాభాల బాట పట్టిస్తాం. కేంద్ర పథకాలను ఆన్‌లైన్‌లో పెడతాం. వెటర్నరీ సర్వీసులను అత్యవసర సేవల్లో చేరుస్తాం. అవసరమైనన్ని వెటర్నరీ మొబైల్ అంబులెన్స్‌లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. నరేగా ద్వారా ప్రాసెస్ చేసిన ఫాడర్(గడ్డి)ని ప్రతి రైతుకు సరఫరా చేయిస్తాం. ఈ బాధ్యతలను డ్వాక్రా గ్రూపులకు అప్పగిస్తాం. మొక్కజొన్న పంటను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వెటర్నరీ స్టూడెంట్స్‌కు ఫీల్డ్ నాలెడ్జ్ కోసం రైతులతో అనుసంధానం చేస్తూ ఇంటర్న్‌షిప్ విధానాన్ని ప్రవేశపెడతాం. రాష్ట్రంలో వివిధ కులవృత్తులవారి జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వ పరంగా ఆర్థిక తోడ్పాటు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం 18 లక్షల హెక్టార్లలో ఉన్న ఉద్యాన పంటల సాగును రెట్టింపు చేసి 36 లక్షల హెక్టార్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని చంద్రబాబు వివరించారు.
ఏపీ నంబర్ వన్
‘టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడల్లా వ్యవసాయం, అనుబంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఫలితంగానే ఆయా రంగాల్లో ఏపీ నంబర్ వన్‌గా నిలుస్తూ వస్తోంది. వ్యవసాయంలో ఏపీ నంబర్ వన్ కాగా.. గుడ్ల ఉత్పత్తిలోనూ మొదటి స్థానంలో ఉంది. మాంసం ఉత్పత్తిలో 5వ స్థానం, పాల ఉత్పిత్తిలో 7వ స్థానంలో ఉంది. మొత్తంగా రాష్ట్ర జీఎ్‌సడీపీలో పశుసంవర్ధక శాఖ వాటా 11.23 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో జీఎ్‌సడీపీ లక్ష్యం రూ.1,95,460 కోట్లుగా నిర్ణయించాం. పాడి పరిశ్రమపై రాష్ట్రవ్యాప్తంగా 42లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. వ్యవసాయ, అనుబంధ రంగాలతో పాటు పరిశ్రమలు, సేవల రంగం ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. డెయిరీకి మైక్రో ఇరిగేషన్‌ను వర్తింపజేస్తాం. మైక్రోఇరిగేషన్‌లో ఈ ఏడాది 2.50 లక్షల ఎకరాలకు ప్రాధాన్యం ఇచ్చాం. మహిళలు సైతం గడ్డి కోసేలా కటింగ్ యంత్రాలు అందుబాటులోకి తీసుకువస్తాం. సోలార్ పవర్‌కు 1000 యూనిట్ల వరకు పర్మిషన్ ఇస్తాం’ అని చంద్రబాబు అన్నారు. ‘గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగింది మామూలు విధ్వంసం కాదు. రూ.10లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రజలపై వేసి వెళ్లారు. బ్రాండ్ ఏపీ మైన్‌సకు పడిపోయింది. ఏపీ పేరు చెబితేనే.. పారిశ్రామికవేత్తలు భయపడి పరుగులు తీసే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని స్టెప్ బై స్టెప్ సరిచేసుకుంటూ వెళ్తున్నాం. నా విశ్వసనీయతతో అందరినీ రాష్ట్రానికి తిరిగి తీసుకువస్తున్నాం. ప్రజలకు ఇబ్బందికరంగా మారిన చట్టాలను సమీక్షిస్తున్నాం. గత ప్రభుత్వం విధించిన నాలా పన్ను తీసేశాం. తాజాగా గ్రామాల్లో డెయిరీ షెడ్లపై గత ప్రభుత్వం విధించిన ప్రాపర్టీ ట్యాక్స్‌ను వెంటనే రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదరిక నిర్మూలన కోసం పీ4కు శ్రీకారం చుట్టాం’ అని సీఎం వివరించారు.
నేను నిత్య విద్యార్థిని
‘నేనెప్పుడూ నిత్య విద్యార్థిగా నేర్చుకుంటూనే ఉంటాను. టెక్నాలజీలో చాలా మార్పులు వస్తున్నాయి. దాన్ని అందిపుచ్చుకున్నవారు మాత్రమే అభివృద్ధి చెందగలరు. హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేయడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక తలసరి ఆదాయం పొందుతున్న వారిలో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. వారిలో 35 శాతం తెలుగువారు ఉన్నారు. ప్రస్తుతం నాలెడ్జ్, టెక్నాలజీని ఉపయోగించుకుని ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ వృత్తిదారులతో ముఖ్యమంత్రి ముఖాముఖీ మాట్లాడారు. పశు పోషణ, డెయిరీ, ఫౌలీ్ట్రల నిర్వహణలో వారి అనుభవాలు, ఆదాయ, వ్యయాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News