Share News

AP Cabinet: రాష్ట్రంలో క్వాంటమ్‌ మిషన్‌

ABN , Publish Date - Jun 05 , 2025 | 04:50 AM

సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా యావజ్జీవ ఖైదీల ముందస్తు విడుదలకు శాశ్వత మార్గదర్శకాలను జారీచేసిన నేపథ్యంలో 2025 ఫిబ్రవరి 1 నాటికి అర్హులైన 17 మంది యావజ్జీవ ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష మంజూరు చేయడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదనను సమ్మతించింది.

AP Cabinet: రాష్ట్రంలో  క్వాంటమ్‌ మిషన్‌

17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష

మహిళా ఉద్యోగులు ఫ్యాక్టరీల్లో ఇకపై రాత్రిళ్లూ పనిచేసే చాన్సు

175 నియోజకవర్గాల్లో 175 ఎంఎ్‌సఎంఈ పార్కులు

క్యాబినెట్‌ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి

అమరావతి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్వాంటమ్‌ మిషన్‌ (ఎస్‌క్యూఎం) స్థాపనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా యావజ్జీవ ఖైదీల ముందస్తు విడుదలకు శాశ్వత మార్గదర్శకాలను జారీచేసిన నేపథ్యంలో 2025 ఫిబ్రవరి 1 నాటికి అర్హులైన 17 మంది యావజ్జీవ ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష మంజూరు చేయడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదనను సమ్మతించింది. బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఎస్‌క్యూఎం స్థాపనకు ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌, కమ్యూనికేషన్ల శాఖ చేసిన ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించిందన్నారు. జాతీయ క్వాంటమ్‌ మిషన్‌లో భాగంగా అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీని స్థాపించి, కృత్రిమ మేధ, సైబర్‌ సెక్యూరిటీ రంగాల్లో పరిశోధనలను ముందుకు తీసుకెళ్లేందుకు ఐఐటీ మద్రాస్‌, టీసీఎస్‌, ఐబీఎం వంటి సంస్థలతో కలిసి పనిచేసి తద్వారా ప్రపంచస్థాయి పరిశోధనలను ఆకర్షించి, అంతర్జాతీయ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావాలనే లక్ష్య సాధనకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని తెలిపారు. ఈ నెలలోనే క్వాంటమ్‌ సదస్సు నిర్వహించి అంతర్జాతీయ నిపుణులతో వ్యూహాత్మక కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. క్షమాభిక్షకు.. మరణశిక్ష వర్తించే నేరాలకు గాను 14 ఏళ్లు, జీవిత ఖైదులో ఏడేళ్లు వాస్తవ శిక్ష అనుభవించిన ఖైదీలు అర్హులని చెప్పారు. క్షమాభిక్ష ద్వారా విడుదలైన తర్వాత ఖైదీలు ప్రతి మూడు నెలలకోసారి సంబంధిత పోలీసు స్టేషన్‌లో హాజరుకావాలి. మళ్లీ ఏదైనా నేరం చేస్తే క్షమాభిక్ష రద్దవుతుంది.


మరిన్ని నిర్ణయాలు..

ఏపీఎ్‌సపీఎ్‌ఫలో 248 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతి ఇవ్వడానికి ఆమోదం.

వైఎ్‌సఆర్‌ జిల్లా పేరును వైఎ్‌సఆర్‌ కడప జిల్లాగా మార్చడానికి ఇప్పటికే జారీ చేసిన తుది నోటిఫికేషన్‌కు ధ్రువీకరణ.

ఏపీ పోలీస్‌ అకాడమీ స్థాపన కోసం ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం పిన్నమరెడ్డిపల్లి, నూగొండపల్లి గ్రామాల్లో 94.497 ఎకరాల ప్రభుత్వ భూమి హోం శాఖకు ఉచితంగా బదిలీ.

ఫ ఏలూరు జిల్లా వంగూరులో నిర్మించతలపెట్టిన హైదరాబాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు మాజీ ఐఏఎస్‌ అధికారిణి కాసరనేని దమయంతి దాన ప్రక్రియ ద్వారా ఇచ్చే 10.88 ఎకరాల భూమి బదలాయింపునకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజుల మినహాయింపు.

ఫ్యాక్టరీల్లో మహిళా ఉద్యోగులు ఇకపై రాత్రి పూట కూ డా విధులు నిర్వహించేందుకు పూర్తి రక్షణతో చట్ట సవరణలకు ఆమోదం. ఫ్యాక్టరీల్లో పని చేసే మహిళలకు ఇప్పటివరకు ఓవర్‌ టైం 50-75 గంటలు మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. ఇకపై వారు త్రైమాసికంలో 144 గం టలు ఓవర్‌ టైం చేసేందుకు నిబంధనలు సవరించారు.


ఎన్టీఆర్‌ సుజల పథకం కింద శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, ఆదివాసీ ప్రాంతాలకు ఆర్‌వో ప్లాంట్‌ ద్వారా సురక్షిత తాగునీటి సరఫరా కోసం రూ.5.75 కోట్ల వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌కు.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల్లో నీటి కొరత ఉన్న 533 జనావాసాల్లో 15 వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు రూ.8.22 కోట్ల వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌కు ఆమోదం.

విశాఖపట్నంలోని హరిత హోటల్‌ యాత్రీనివాస్‌ పనులకు ఇప్పటికే సవరించి అమలుపరచిన పరిపాలనా అనుమతులకు ధ్రువీకరణ. గత ప్రభుత్వం హరిత హోటల్‌ అభివృద్ధి పనులకు రూ.4.5 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపి.. ఆనక అనుమతుల్లేకుండానే రూ.13.50 కోట్లకు పెంచి ఖర్చు చేశారు. ఆ పెంపును ఇప్పుడు క్యాబినెట్‌ ఆమోదించింది.

ఆంధ్రప్రదేశ్‌ ఎకనామిక్‌ సిటీస్‌ ప్రమోషన్‌, డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీఈడీసీవో) ద్వారా ఎన్టీఆర్‌ జిల్లా వేమవరంలోని జెట్‌ సిటీ వద్ద ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ పనులు పూర్తి చేయడానికి ఆమోదం. జెట్‌ సిటీ ప్రాజెక్టు మొదటి దశకు 10.12 ఎకరాలు కేటాయింపు. స్టాంపు సుంకం, రుసుము మినహాయించి ఏపీఐఐసీకి బదిలీ.

రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక కింద రూ.20.39 కోట్ల మేర బిల్లుల చెల్లింపుకు అనుమతి.

‘ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త’ అనే విధానంతో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 175 ఎంఎ్‌సఎంఈ పార్కుల అభివృద్ధికి ఆమోదం.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 04:50 AM