Share News

Andhra Jyothi: ఇది మొదటి అడుగే

ABN , Publish Date - May 23 , 2025 | 05:25 AM

అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం ద్వారా జీవకోన ప్రాంతంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వబడింది. సీసీ రోడ్లు, డ్రెయిన్లు, పోలీస్ ఔట్ పోస్టు వంటి అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.

Andhra Jyothi: ఇది మొదటి అడుగే

ప్రతి జిల్లాలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

‘ఆంధ్రజ్యోతి’ ఈడీ వేమూరి ఆదిత్య ప్రకటన

మున్సిపల్‌, తుడా నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించాం

మహిళలకు భద్రత కోసం పోలీస్‌ అవుట్‌ పోస్టు ఏర్పాటు

ఇళ్ల పట్టాల సమస్యనూ పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే ఆరణి

తిరుపతి జీవకోనలో ‘అక్షరమే అండగా..’ సభ

రూ.1.06 కోట్లతో అభివృద్ధి పనులకు భూమి పూజ

తిరుపతి, మే 22(ఆంధ్రజ్యోతి): ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ పేరుతో చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కారంలో ఇది మొదటి అడుగు మాత్రమేనని ‘ఆంధ్రజ్యోతి’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వేమూరి ఆదిత్య స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకటించారు. గురువారం తిరుపతి నగరం జీవకోన అంబేడ్కర్‌ కూడలి సమీపంలోని శ్రీలలితా త్రిపుర సుందరి ఆలయ ఫంక్షన్‌ హాల్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జనవరిలో జీవకోనలో నిర్వహించిన ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ సదస్సులో ప్రజలు ప్రస్తావించిన సమస్యలకు సంబంధించి రూ.62లక్షలతో సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణాలు పూర్తయ్యాయని వివరించారు. మరో రూ.1.06కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసినట్లు తెలిపారు. సభలో ప్రజల నుంచి మరిన్ని వినతులు అందాయని, వాటిని కూడా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజా సమస్యలను వార్తలుగా ప్రచురించడానికే పరిమితం కాకుండా వాటి పరిష్కారానికి ‘ఆంధ్రజ్యోతి’ చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని కొనియాడారు. జీవకోనలో గంజాయి బ్యాచ్‌లు, ఆకతాయిల ఆగడాలను అరికట్టి మహిళలకు భద్రత కల్పించేందుకు పోలీస్‌ అవుట్‌ పోస్టును ఏర్పాటు చేశామని చెప్పారు.


శ్మశానానికి ప్రహరీ, గేట్లు ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేశామన్నారు. జీవకోన ప్రాంతంలో ఎక్కువ ఇళ్లకు శాశ్వత పట్టాలు, పత్రాలు లేకపోవడం ప్రధాన సమస్యగా ఉందని, దీనిపై రెవెన్యూ, అటవీ, టీటీడీ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ‘ఆంధ్రజ్యోతి’ వేసిన పునాదిని కొనసాగించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ మౌర్య అన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే, మున్సిపల్‌ కమిషనర్‌తో కలసి జీవకోనలో రూ.1.06 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేసిన అభివృద్ధి పనులకు జరిగిన భూమి పూజలో ఆదిత్య పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన రెండు ఆర్వో ప్లాంట్లను పరిశీలించారు. అంబేడ్కర్‌ కూడలిలో జిల్లా పోలీసు శాఖ ఏర్పాటు చేసిన పోలీసు ఔట్‌ పోస్టు ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు సత్యనారాయణపురం నుంచీ ఎర్రమిట్టకు నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవంలోనూ ఆయన పాల్గొన్నారు. సభలో ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కుమారమ్మ, ‘ఆంధ్రజ్యోతి’ అసిస్టెంట్‌ ఎడిటర్‌ ఆర్‌ఎం ఉమామహేశ్వరరావు, బ్రాంచి మేనేజర్‌ సురే్‌షరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టాం

భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్

For National News And Telugu News

Updated Date - May 23 , 2025 | 05:25 AM