Share News

rdo మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , Publish Date - Mar 08 , 2025 | 12:12 AM

ప్రస్తుత ఆధునిక యుగంలో మహిళలు రంగాల్లో పట్టు సాధించి.. రాణించాలని ఆర్డీఓ వీవీఎస్‌ శర్మ పేర్కొన్నారు.

rdo మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీఓ

కదిరి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఆధునిక యుగంలో మహిళలు రంగాల్లో పట్టు సాధించి.. రాణించాలని ఆర్డీఓ వీవీఎస్‌ శర్మ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఐసీడీఎస్‌ కదిరి ప్రాజెక్టులో మహిళ దినోత్సవాన్ని పురష్కరించుకొని నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ సమాజమైతే మహిళను ఉన్నతంగా చూస్తుందో ఆ సమాజం అభివృద్ధి వైపు నడుస్తుందన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ రాధిక, ఎంఈఓ చెన్నక్రిష్ణ, కౌన్సిలర్‌ శివలత, ప్రముఖ న్యాయవాది నరసింహులు, సమత సంస్థ ప్రతినిధులు వెంకటేష్‌, శ్రీనివాసులనాయుడు, బాబ్‌జాన, ఉమాశంకర్‌రెడ్డి, మౌనిక, మనోహర్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2025 | 12:12 AM