అభివృద్ధి ఎక్కడ బ్రదర్స్..?
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:49 AM
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి స్వగ్రామం మండలంలోని తోపుదుర్తి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని తోపుదుర్తి బ్రదర్స్ గొప్పలు పోతుంటారు. వారి స్వగ్రామంలోనే అభివృద్ధి కరువైంది. గెలిపించిన ఊరినే తోపుదుర్తి సోదరులు పట్టించుకోలేదని గ్రావమస్థులు విమర్శిస్తున్నారు. గ్రామంలో 520 కుటుంబాలు నివాసముంటున్నాయి. వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేశారనే విమర్శలు ఉన్నాయి. గ్రామంలో తాగునీరు లేక, మురుగునీటితో నిండిన వీధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు...
ఇది మాజీ ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డి స్వగ్రామంలోని ఆయన ఇంటికి వెళ్లే రోడ్డు. ఐదేళ్లు అధికారంలో ఉన్నా.. సొంత ఇంటికెళ్లే రోడ్డులో మురుగు కాలువలో తవ్వించలేకపోయారు ప్రకా్‌షరెడ్డి. దీంతో మురుగు నీరు వెళ్లే మార్గంలేక ఇలా రోడ్డుపైకి చేరుతోంది. అక్కడే నిల్వ ఉంటోంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటూ దుర్వాసన వెదజల్లుతోందని గ్రామస్థులు వాపోతున్నారు.
సమస్యల వలయంలో మాజీ ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డి స్వగ్రామం
తోపుదుర్తిలో డ్రైనేజీ కాలువలు కూడా లేని దుస్థితి
రోడ్లపైనే మురుగునీరు
అసంపూర్తిగా నాడు-నేడు పనులు
జగనన్న కాలనీలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలు
ఐదేళ్లు అధికారంలో ఉన్నా.. సొంతూరికి చేసింది శూన్యం
ఆత్మకూరు, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి స్వగ్రామం మండలంలోని తోపుదుర్తి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని తోపుదుర్తి బ్రదర్స్ గొప్పలు పోతుంటారు. వారి స్వగ్రామంలోనే అభివృద్ధి కరువైంది. గెలిపించిన ఊరినే తోపుదుర్తి సోదరులు పట్టించుకోలేదని గ్రావమస్థులు విమర్శిస్తున్నారు. గ్రామంలో 520 కుటుంబాలు నివాసముంటున్నాయి. వారికి అవసరమైన సౌకర్యాలు
కల్పించడంలో నిర్లక్ష్యం చేశారనే విమర్శలు ఉన్నాయి. గ్రామంలో తాగునీరు లేక, మురుగునీటితో నిండిన వీధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్లపైనే మురుగునీరు
గ్రామంలో మురుగు కాలువలు లేక రోడ్డుపైనే మురుగు నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల ముందు నడవలేకపోతున్నారు. పీర్ల మసీదు వీధి, ప్రధాన రోడ్డు, బీసీ కాలనీ, వాల్మీకి విగ్రహం పడమటి వీధి, చెరువు దారి పక్క వీధి, కాపుగేరి తదితర ప్రాంతాల్లో మురుగు నీటితో తీవ్ర అసౌకర్యంగా మారింది. రోడ్లపైనే మురుగునీరు నిల్వ ఉంటోంది. దుర్వాసన వెదజల్లుతోందని గ్రామస్థులు వాపోతున్నారు. సమస్యలతో సతమవుతున్నామని వాపోతున్నారు.