COLLECTOR: కేజీబీవీలో అన్ని వసతులు కల్పిస్తాం
ABN , Publish Date - Dec 09 , 2025 | 12:30 AM
గుండుమల కేజీబీవీలో వసతులు కల్పిస్తామని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. మండలంలోని గుండుమల గ్రామంలో ఉన్న కేజీబీవీ పాఠశాలను ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో కలిసి కలెక్టర్ సోమవారం రాత్రి తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
మడకశిర రూరల్, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): గుండుమల కేజీబీవీలో వసతులు కల్పిస్తామని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. మండలంలోని గుండుమల గ్రామంలో ఉన్న కేజీబీవీ పాఠశాలను ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో కలిసి కలెక్టర్ సోమవారం రాత్రి తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, 250 మందికి కేవలం రెండు బాతరూమ్‌లు మాత్రమే పనిచేస్తున్నాయని, తాగునీటి వసతులు లేక ఇబ్బంది పడుతున్నామని విద్యార్థినులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ స్పందిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. కేజీబీవీలో వసతులు, విద్యాబోధన, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్‌ఓ, కొంత మంది సిబ్బందితో వివరణ తీసుకున్నామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యావ్యవస్థలో అనేక మార్పులు తెచ్చేందుకు విద్యాశాఖ మంత్రి నారాలోకేశ అనేక సంస్కరణలు తీసుకువస్తున్నా అక్కడక్కడా పనిచేస్తున్న ఉద్యోగుల అలసత్వం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. అలాంటి వారిని ఉపేక్షించేదిలేదన్నారు. కేజీజీవీలో విద్యార్థినులకు అన్ని వసతులు కల్పిస్తామన్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి కలెక్టర్, ఎమ్మెల్యే సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.