Vadde Obanna భావితరాలకు స్ఫూర్తి వడ్బె ఓబన్న
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:01 AM
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని కలెక్టర్ టీఎస్ చేతన పేర్కొన్నారు. శనివారం వడ్డె ఓబన్న జయంతి వేడుకలను కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు.

కలెక్టర్ టీఎస్ చేతన... ఘనంగా జయంతి వేడుకలు
పుట్టపర్తిటౌన, జనవరి 11(ఆంధ్ర జ్యోతి): ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని కలెక్టర్ టీఎస్ చేతన పేర్కొన్నారు. శనివారం వడ్డె ఓబన్న జయంతి వేడుకలను కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. వడ్డె ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంగ్లేయుల బారినుంచి తమ జాతిని రక్షించుకోవడం కోసం వడ్డె ఓబన్న చేసిన పోరాటం చిరస్మరణీయం అన్నారు. ప్రభుత్వం ఓబన్న జయంతిని అఽధికారంగా నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో విజయసారధి, బీసీ సంక్షేమశాఖ అధికారులు, అన్నిశాఖలు జిల్లా అధికారులు పాల్గొన్నారు.