ప్రతి DM HO : ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలి
ABN , Publish Date - Aug 07 , 2025 | 01:21 AM
స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించాలని డీఎంహెచఓ డాక్టర్ ఈబీ దేవి పేర్కొన్నారు. హర్‌ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బుధవా...
డీఎంహెచఓ డాక్టర్ ఈబీ దేవి
అనంతపురం వైద్యం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించాలని డీఎంహెచఓ డాక్టర్ ఈబీ దేవి పేర్కొన్నారు. హర్‌ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బుధవారం డీఎంహెచఓ భవనంపై ఆమె జాతీయ జెండాను ఎగుర వేసి వందనం సమర్పించారు. కార్యక్రమంలో ఏఓ గిరిజా మనోహర్ రావు, పలువురు డిస్ర్టిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, డెమో త్యాగరాజు, హెచఈఓ నాగరాజు, డిప్యూటీ హెచఈఓ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.