TRIBUTE: ఘంటసాల పాట అజరామరం
ABN , Publish Date - Feb 11 , 2025 | 11:49 PM
ఘంటసాల పా ట అజరామరమని జిల్లా రెవెన్యూ శాఖాధికారి మలోల, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ఘంటసాల పా ట అజరామరమని జిల్లా రెవెన్యూ శాఖాధికారి మలోల, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పద్మ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 51వ వర్ధంతిని పురస్కరించుకుని పాతపాటల ప్రేమికుల సంఘం, పద్మశ్రీ ఘంటసాల సంగీత సాంస్కృతిక సేవాట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం హౌసింగ్ బోర్డు రాజీవ్‌చిల్డ్రన్స పార్కులోని ఘంటసాల మండపం వద్ద నిర్వహించిన సభకు వారితోపాటు హైదరాబాద్‌కు చెందిన గాయకుడు బాలకామేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంగీత విభావరిలో కళాకారులు ఘంటసాల పాటలతో అలరించారు. కార్యక్రమంలో ఎస్కేయూ విశ్రాంత రిజిస్ర్టార్ ఆచార్య సుధాకర్‌బాబు, జగర్లపూడి శ్యామసుందర శాసి్త్ర, జీవీ రామయ్య, ఓబులదాస్, విజయ రాగవన, బృంద, మహీధర్ పాల్గొన్నారు.