Share News

MLA BALAKRISHNA: కష్టకాలంలో ఉన్నవారిని పార్టీ గుర్తిస్తుంది

ABN , Publish Date - Nov 18 , 2025 | 12:15 AM

కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ వెన్నంటే ఉంటుందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భరోసా ఇచ్చారు. సోమవారం పట్టణంలోని సాయితేజ, కల్యాణమండపంలో క్లస్టర్‌ యూనిట్‌ బూత ఇన్చార్జ్‌లతో సమావేశం అయ్యారు.

MLA BALAKRISHNA: కష్టకాలంలో ఉన్నవారిని పార్టీ గుర్తిస్తుంది
MLA Balakrishna speaking

క్లస్టర్‌ యూనిట్‌ ఇన్చార్జ్‌లతో ఎమ్మెల్యే బాలకృష్ణ

హిందూపురం, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ వెన్నంటే ఉంటుందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భరోసా ఇచ్చారు. సోమవారం పట్టణంలోని సాయితేజ, కల్యాణమండపంలో క్లస్టర్‌ యూనిట్‌ బూత ఇన్చార్జ్‌లతో సమావేశం అయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ హయాంలో ఎన్ని బాధలొచ్చినా, వారు ఎంత వేధించినా పార్టీ వెంటే ఉన్న ప్రతి కార్యకర్తకు తాను అండగా నిలుస్తానన్నారు. స్థానిక ఎన్నికల్లో క్లస్టర్‌ యూనిట్‌ బూత ఇన్చార్జ్‌లకు అవకాశం కల్పిస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. నన్ను మూడుసార్లు హిందూపురం నుంచి గెలిపించినందుకు జీవితాంతం ఈ నియోజకవర్గానికి రుణపడి ఉంటానన్నారు. కార్యకర్తకు ఏదైనా సమస్యవస్తే నేరుగా తనకే చెప్పుకోవచ్చన్నారు. ఏ ఒక్క టీడీపీ కార్యకర్తను ఎవరూ తాకలేరన్నారు. దేశంలోనే టీడీపీకి ఉన్న కార్యకర్తలు ఏ రాజకీయ పార్టీకి ఒక్కరాష్ట్రంలో అంతమంది లేరన్నారు. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తీచేస్తున్న బూత ఇన్చార్జ్‌లకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కొంతమంది యూనిట్‌, బూత ఇన్చార్జ్‌లకు వారి సమస్యలను ఎమ్మెల్యేకు చెప్పుకున్నారు. మార్కెట్‌యార్డ్‌ చైర్మన అశ్వర్థనారాయణరెడ్డి, పట్టణాధ్యక్షుడు వెంకటేశ, క్లస్టర్‌ ఇన్చార్జ్‌లు అమర్నాథ్‌, చంద్రమోహన, ప్రవీణ్‌, రాఘవేంద్ర, రవీంద్రనాయుడు, మారుతిప్రసాద్‌, రంగారెడ్డి, డైరెక్టర్లు చంద్రమోహన, గంగాధర్‌, పరిమళ, జయప్ప, టీడీపీ వాణిజ్యవిభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరుణాచల్‌రెడ్డి, మంజునాథ్‌, ఉమాశంకర్‌రెడ్డి, ఆదినారాయణ, రామక్రిష్ణారెడ్డి, శంకర్‌ పాల్గొన్నారు.

అన్న క్యాంటీన ఏర్పాటు చేయండి

ఆసియా ఖండంలోనే అతిపెద్ద చింతపండు మార్కెట్‌ హిందూపురంలో ఉందని, ఇక్కడ అన్న క్యాంటీన ఏర్పాటు చేయాలని మార్కెట్‌యార్డ్‌ చైర్మన అశ్వత్థనారాయణరెడ్డి ఎమ్మెల్యే బాలకృష్ణను కోరారు. సోమవారం ఎమ్మెల్యేతో మార్కెట్‌ పాలకవర్గం సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ మార్కెట్‌యార్డ్‌లో చింతపండు, మిరపకాయల సీజనలో సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది రైతులు, హమాలీలు వస్తారన్నారు. ఇక్కడ క్యాంటీన ఏర్పాటు చేస్తే రైతులకు ప్రయోజనంగా ఉంటుందన్నారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. మార్కెట్‌యార్డ్‌ తరఫున పల్లెలకు లింకురోడ్డు నిర్మాణానికి నిధులు ఇప్పించాలని కోరారు. మార్కెట్‌యార్డ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2025 | 12:15 AM