Share News

‘శ్రీకృష్ణుడి అవతారం మహోన్నతమైనది’

ABN , Publish Date - Aug 18 , 2025 | 12:55 AM

శ్రీకృష్ణుడి అవతారం ఎంతో మహోన్నతమైందని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనంతపురం శాఖ ఇనచార్జి శారద సిస్టర్‌ అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక ఎన్టీఆర్‌ మార్గ్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో వేడుకలను వైభవంగా నిర్వహించారు.

‘శ్రీకృష్ణుడి అవతారం మహోన్నతమైనది’

అనంతపురం టౌన, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): శ్రీకృష్ణుడి అవతారం ఎంతో మహోన్నతమైందని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనంతపురం శాఖ ఇనచార్జి శారద సిస్టర్‌ అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక ఎన్టీఆర్‌ మార్గ్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో వేడుకలను వైభవంగా నిర్వహించారు.


ఈ సందర్భంగా శారద సిస్టర్‌ మాట్లాడుతూ... శ్రీకృష్ణుడి అవతారం మహోన్నతమైనదని, భగవద్గీతలో ఆయన చేసిన బోధనల్లో ధర్మం, ఖర్మ, జ్ఞానం, భక్తి అన్నీ ఉన్నాయని అన్నారు. ఇవి జీవితాన్ని మెరుగుపరచడానికి, జీవితంలో ఎదురయ్యే అనేక రకాల సమస్యలకు పరిష్కారాలను సూచిస్తాయని తెలిపారు. అనంతరం నిర్వహించిన సంబరాల్లో చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణల్లో అలరించారు. తదనంతరం చిన్నారులకు జ్ఞాపికలు బహూరించారు. కార్యక్రమంలో పీటీసీ యోగా గురువు మురళీకృష్ణ, బ్రహ్మకుమారీలు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపుంర వార్తల కోసం...

Updated Date - Aug 18 , 2025 | 12:55 AM