Share News

TDP: రైతుల సంక్షేమమే కూటమి లక్ష్యం

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:41 AM

రైతుల సంక్షేమమే కూటమి ప్రభు త్వ లక్ష్యమని మాజీ మంత్రిపల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. మండలంలోని గూ నిపల్లి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు జుటూరు ప్రభాకర్‌రెడ్డి, డైరెక్టర్‌ శ్రీరాములు ప్రమాణ స్వీకారానికి పల్లె హాజరై మాట్లాడారు.

TDP: రైతుల సంక్షేమమే కూటమి లక్ష్యం
సొసైటీ అధ్యక్షుడిని సన్మానిస్తున్న మాజీ మంత్రి పల్లె

బుక్కపట్నం, ఆగస్టు10 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే కూటమి ప్రభు త్వ లక్ష్యమని మాజీ మంత్రిపల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. మండలంలోని గూ నిపల్లి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు జుటూరు ప్రభాకర్‌రెడ్డి, డైరెక్టర్‌ శ్రీరాములు ప్రమాణ స్వీకారానికి పల్లె హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో రై తుల సంక్షేమంకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదాత సుఖీ పథకం ద్వా రా 46లక్షల కుటుంబలకు రూ.పదివేల కోట్లు వారి ఖాతాలో జమ చేశారన్నారు. మంచి చేసిన కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ప్రజలు ఆశీర్వదించాలన్నారు. కష్టపడిన కార్యకర్తలకు పార్టీ గుర్తింపు ఇస్తుందన్నారు. కన్వీనర్‌ చింతా మల్లిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగాధర్‌, క్రిష్ణాపురం, వెంగలమ్మ చె రువు సొసైటీ అధ్యక్షుడు అప్పస్వామినాయుడు, శ్రీరామిరెడ్డి, నాయకులు సు బ్బారెడ్డి, వెంకటనారాయణరెడ్డి, లావణ్యగౌడ్‌, వెంకటరాముడు పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 12:41 AM