Endonment land మాన్యం.. బేరం..?
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:18 PM
మండల కేంద్రంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ మాన్యం భూమిని కొందరు అమ్మకానికి పెట్టారు. ఆ స్థలం తమదేనని శుభ్రం చేస్తున్నారు. చెన్నకేశవస్వామి ఆలయ భూములు 350 ఎకరాలకు పైగా ఉండేవి. అన్యాక్రాంతం తరువాత వంద ఎకరాలు మిగిలాయి. ఉన్నవాటిపైనా కొందరు కన్నేశారు.

యాడికి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ మాన్యం భూమిని కొందరు అమ్మకానికి పెట్టారు. ఆ స్థలం తమదేనని శుభ్రం చేస్తున్నారు. చెన్నకేశవస్వామి ఆలయ భూములు 350 ఎకరాలకు పైగా ఉండేవి. అన్యాక్రాంతం తరువాత వంద ఎకరాలు మిగిలాయి. ఉన్నవాటిపైనా కొందరు కన్నేశారు. ‘స్వామివారి సన్నిధిలో నాట్యం చేసేవారి కోసం’ అని డైక్లాట్‌లో పొందుపరిచిన సర్వే నంబరు 550లోని 7.16 ఎకరాలకు ఎసరు పెట్టారు. సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయంలో నిషేధిత భూముల జాబితాలో ఉన్నా, అగ్రిమెంట్ల ద్వారా అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఆ భూమికి పక్కనే కొత్తగా హౌసింగ్ కాలనీ ఏర్పాటైంది. దీంతో స్వామివారి భూమి విలువ ఎకరం రూ.కోటి పలుకుతోంది. అది చెన్నకేశవస్వామి మాన్యం అని, 22(ఏ) జాబితాలో ఉందని ఈఓ దుర్గాప్రసాద్ తెలిపారు. ఆ భూమి క్రయ, విక్రయాలు చెల్లుబాటు కావని స్పష్టం చేశారు. ఆ భూమిని శుక్రవారం పరిశీలిస్తామని, అన్యాక్రాంతం కాకుండా చూస్తామని అన్నారు.