LAYOUTS: అనుమతిలేని లేఅవుట్లపై కఠిన చర్యలు
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:11 AM
మండలంలో అనుమతిలేని లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ పొలప్ప హె చ్చరించారు. శుక్రవారం రాత్రికి రాత్రే అక్రమ లేఅవుట్లు అన్న కథ నం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది.
కదిరి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): మండలంలో అనుమతిలేని లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ పొలప్ప హె చ్చరించారు. శుక్రవారం రాత్రికి రాత్రే అక్రమ లేఅవుట్లు అన్న కథ నం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన ఎంపీడీఓ శుక్రవారం మండలంలోని సున్నంపుగుట్ట తండాలో సర్వే నం బర్ 178లో వేసిన అక్రమ లేఅవుట్లును తొలగించారు. ప్లాట్లకు వేసిన పునాది రాళ్లను ఎక్స్‌కవేటర్‌తో చదును చేయించారు. ఆయ న మాట్లాడుతూ అనుమతి లేకుండా లేఅవుట్లు ఎవరు వేసినా, చర్యలు తప్పవని హెచ్చరించారు. అందులో ప్లాట్లను అమ్మడం చట్ట విరుద్ధమన్నారు. అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయరాదన్నారు. ఆయనతోపాటు పంచాయతీ కార్యదర్శి రామమోహన, వీఆర్‌ఓ ఓబులేసు, సర్వేయర్లు ఉన్నారు.