Bada బడా స్మారక స్తూపం ఆవిష్కరణ
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:52 PM
ఇటీవల మృతిచెందిన సీపీఎం సీనియర్ నాయకులు బడా సుబ్బిరెడ్డి స్వగ్రామమైన వరిగిరెడ్డిపల్లి గ్రామంలో స్మారక స్తూపం బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు రాంభూపాల్, నాయకులు ఓబులు మాట్లాడారు.

కదిరిఅర్బన, మార్చి5(ఆంధ్రజ్యోతి): ఇటీవల మృతిచెందిన సీపీఎం సీనియర్ నాయకులు బడా సుబ్బిరెడ్డి స్వగ్రామమైన వరిగిరెడ్డిపల్లి గ్రామంలో స్మారక స్తూపం బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు రాంభూపాల్, నాయకులు ఓబులు మాట్లాడారు. 30 సంవత్సరాలుగా రైతు, ప్రజా ఉద్యమాల్లో సుబ్బిరెడ్డి చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమన్నారు. ఎన్పీకుంట సోలార్ ప్రాజెక్టులో భూములో కోల్పోయిన రైతులకు పరిహారం, పునరావాసం కోసం, పార్టీ నిర్వహించిన పోరాటంలో సుబ్బిరెడ్డి ముందు వరుసలో నిలిచాడన్నారు. కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ నరసింహులు, అన్నదాత రామిరెడ్డి, రామకృష్ణ, సీపీఎం నాయకులు జంగాలపల్లి పెద్దన్న, లక్ష్మీనారాయణ, జీఎల్ నరసింహులు, హరి, కదిరప్ప, ప్రవీణ్‌కుమార్, ఐద్వా మహిళ సంఘం నాయకురాలు శాంతిబాయి, మున్నీ, అంగనవాడీ యూనియన నాయకురాలు మాబూన్నీషా, సుశీల, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.