Sri Satya Sai SP మహిళలు ధైర్యంగా ముందడుగు వేయాలి
ABN , Publish Date - Mar 07 , 2025 | 11:37 PM
ఆధునిక సమాజంలో మహిళలకు ఇంటా బయటా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందడుగు వేయాలని ఎస్పీ వి.రత్న పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి జిల్లా పోలీసు కార్యాలయం వరకు విద్యార్థినులు, పోలీసు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.

ఉత్తమ సమాజ నిర్మాణంలో అత్యంత కీలకం
సెల్‌ఫోన్లతో జాగ్రత్త : ఎస్పీ
పుట్టపర్తి రూరల్, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ఆధునిక సమాజంలో మహిళలకు ఇంటా బయటా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందడుగు వేయాలని ఎస్పీ వి.రత్న పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి జిల్లా పోలీసు కార్యాలయం వరకు విద్యార్థినులు, పోలీసు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో విద్యార్థినులచే మహిళా సాధికారతను కాంక్షిస్తూ ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. ఓపెనహౌ్‌స కార్యక్రమాన్ని ప్రారంభించి పోలీసులు ఉపయోగించే ఆయుధాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేటి సమాజంలో సెల్‌ఫోన యుగం నడుస్తోందని, నిత్యజీవితంలో మహిళల జీవితాలపై విపరీతమైన ప్రభావం చూపిస్తోందని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తులతో పరిచయాల వల్ల జీవితాలు అంధకారమవుతున్నాయని తెలిపారు. బాలికలు సెల్‌ఫోన ఉపయోగించడంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. తియ్యగా మాట్లాడుతూ ప్రలోభాలకు గురిచేసే ఫేస్‌బుక్ పరిచయాలపట్ల అత్యంత జాగ్రత్తగా మెలగాలని హితవు పలికారు. కార్యక్రమంలో డీఎస్పీలు విజయ్‌కుమార్, ఆదినారాయణ, ఏఓ సుజాత, సూపరింటెండెంట్ సరస్వతి, సీఐలు బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, సురేష్, సునీత, నరేందర్‌రెడ్డి, ఇందిర, సిబ్బంది పాల్గొన్నారు.