Share News

రైతులకు అందుబాటులో ఉండాలి

ABN , Publish Date - Sep 19 , 2025 | 12:27 AM

వ్యవసాయ శాఖ, అనుబంధ రంగాల అధికారులు.. రైతులకు నిత్యం అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ ఆనంద్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో కలెక్టర్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ... ఆయా శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అవసరం ఉన్న వారికి యూరియా తప్పక పంపిణీ చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన నివేదికలు రోజూ అందించాలన్నారు. ...

రైతులకు అందుబాటులో ఉండాలి
speaking collector

అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు

అనంతపురం కలెక్టరేట్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ శాఖ, అనుబంధ రంగాల అధికారులు.. రైతులకు నిత్యం అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ ఆనంద్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో కలెక్టర్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ... ఆయా శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అవసరం ఉన్న వారికి యూరియా తప్పక పంపిణీ చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన నివేదికలు రోజూ అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఆయిల్‌ ఫామ్‌ తోటల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలనీ, వీలైనంత వరకు ఒకే గ్రామంలో పంట పెట్టేలా చూడాలన్నారు. జిల్లాలో చేపల ఉత్పత్తి మరింత పెరగాలన్నారు. జిల్లాలో 58 పీఏసీఎ్‌సలకు సీడ్‌, ఫర్టిలైజర్‌ లైసెన్సులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథ రెడ్డి, మార్క్‌ఫెడ్‌ డీఎం పెన్నేశ్వరి, ప్రకృతి వ్యవసాయం డీపీఎం లక్ష్మానాయక్‌, మార్కెటింగ్‌ ఏడీ రాఘవేంద్ర, డీసీఓ అరుణకుమారి, సెరికల్చర్‌ ఏడీ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

పనితీరు మెరుగుపరచుకోవాలి..

అధికారులు పనితీరు మెరుగుపరచుకుని సత్ఫలితాలు సాధించాలని కలెక్టర్‌ ఆనంద్‌ సూచించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖలకు చెందిన అధికారులతో పనితీరుపై సమీక్షించారు. తొలుత పరిశ్రమల శాఖపై చర్చించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలనీ, పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని ఆదేశించారు. భారీ పరిశ్రమల కోసం స్థల సేకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. గనులు, భూగర్భజల వనరుల శాఖపై ఆరాతీశారు. ఇసుక లభ్యతపై సమీక్షించారు. కొత్త గనుల మంజూరు విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2025 | 12:27 AM