Share News

She Box మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం: కలెక్టర్‌

ABN , Publish Date - Mar 07 , 2025 | 11:39 PM

జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి, వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్‌ టీఎస్‌ చేతన తెలిపారు. శుక్రవారం ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయంలో మహిళా ఉద్యోగుల సమస్యల కోసం షీ బాక్స్‌ ఏర్పాటు చేశారు

She Box మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం: కలెక్టర్‌
షీ బాక్స్‌ను కలెక్టర్‌కు అందజేస్తున్న జేఏసీ నేతలు

పుట్టపర్తి టౌన, మార్చి 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి, వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్‌ టీఎస్‌ చేతన తెలిపారు. శుక్రవారం ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయంలో మహిళా ఉద్యోగుల సమస్యల కోసం షీ బాక్స్‌ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. అనేక సమస్యలు, ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తా అన్నారు. షీ బాక్స్‌ ద్వారా వచ్చిన సమస్యలను గోప్యంగా ఉంచి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జేఏసీ అందించిన షీ బాక్స్‌ను కలెక్టరేట్‌లోని పరిపాలన విభాగం వద్ద ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ చైర్‌పర్సన విజయభారతి, ప్రధాన కార్యదర్శి మధునాయక్‌, జిల్లా అధ్యక్షురాలు గీతాంజలి, కార్యదర్శి సుభాషిణి, ముఖ్యులు రమాదేవి, ప్రభావతి, రుక్మిణీ, అమీనాబాను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2025 | 11:39 PM