SFI: విద్యార్థుల సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ రాజీలేని పోరాటం
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:07 AM
విద్యార్థుల సమస్యల కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించే ఏకైక సంఘం ఎస్‌ఎ్‌ఫఐ అని టూటౌన సీఐ రెడ్డప్ప, సంఘం జిల్లాకార్యదర్శి నాగార్జున అన్నారు. శుక్రవారం స్థానిక టూ టౌన పోలీ్‌సస్టేషనలో ఎస్‌ఎ్‌పఐ 25వ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్లను సీఐ చేతులమీదుగా ఆవిష్కరించారు.
ధర్మవరం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల సమస్యల కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించే ఏకైక సంఘం ఎస్‌ఎ్‌ఫఐ అని టూటౌన సీఐ రెడ్డప్ప, సంఘం జిల్లాకార్యదర్శి నాగార్జున అన్నారు. శుక్రవారం స్థానిక టూ టౌన పోలీ్‌సస్టేషనలో ఎస్‌ఎ్‌పఐ 25వ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్లను సీఐ చేతులమీదుగా ఆవిష్కరించారు. సీఐ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల కోసం నిరంతరం తోడుగా అండగా నిలవాలని సూచించారు. నాగార్జున మాట్లాడుతూ 25వ రాష్ట్ర మహాసభలు తిరుపతిలో 12, 13, 14తేదీలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర మహాసభలకు 500 మంది ఎంపిక చేసిన ప్రతినిధులు పాల్గొంటారన్నారు. కూటమి ప్రభుత్వం నేటికీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిఇ్‌పలు వెంటనే విడుదల చేయాలన్నారు. సంక్షేమహాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని, మెస్ చార్జీలు పెంచాలని కోరారు. బుక్కపట్నం మండలంలో అర్ధంతరంగా నిలిచిపోయిన ప్రభుత్వ డిగ్రీకళాశాల నిర్మాణం పూర్తీచేయాలన్నారు. జిల్లా కేంద్రంలో సత్యసాయి యూనివర్సిటీ ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేశారు. పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అమన, శ్రీనాథ్, యూనస్, అఖిల్, ప్రణీతకృష్ణ, రవి పాల్గొన్నారు.