Scanning centers స్కానింగ్ సెంటర్లపై నిరంతరం నిఘా ఉంచాలి: ఆర్డీఓ
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:59 AM
గర్భస్థ లింగ నిర్ధారణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ స్కానింగ్ సెంటర్లపై నిరంతర నిఘా పెట్టాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆర్డీఓ కేశవనాయుడు ఆదేశించారు. నగరంలోని తన కార్యాలయంలో బుధవారం ఆయన పీసీ అండ్ పీఎన్డీటీ యాక్టు అమలుపై సమీక్షను నిర్వహించారు.
అనంతపురం వైద్యం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): గర్భస్థ లింగ నిర్ధారణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ స్కానింగ్ సెంటర్లపై నిరంతర నిఘా పెట్టాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆర్డీఓ కేశవనాయుడు ఆదేశించారు. నగరంలోని తన కార్యాలయంలో బుధవారం ఆయన పీసీ అండ్ పీఎన్డీటీ యాక్టు అమలుపై సమీక్షను నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్కానింగ్ సెంటర్లలో డాక్టర్ రిక్విజేషన లేకున్నా, నిబంధనలు పాటించకున్నా తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐసీడీఎస్, వైద్యశాఖ సంయుక్తంగా పని చేస్తూ బాల్య వివాహాలపై ఇంటింటికీ అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్వజన వైద్యశాల పీడియాట్రిక్స్ హెచఓడీ డాక్టర్ రవికుమార్, గైనకాలజిస్ట్ డాక్టర్ రేణుక, పేథాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్, సీఐ శాంతిలాల్ పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..