గుత్తి డిపో అభివృద్ధికి రూ.4 కోట్లు
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:25 AM
గుత్తి బస్టాండు, డిపో అభివృద్ధికి రూ.4 కోట్లు మంజూరు చేస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ ఆర్టీసీ బస్టాండ్‌లు, డిపోలను ఆయన గురువారం సందర్శించారు. ఆర్టీసీ రాయలసీమ జోన చైర్మన పూల నాగరాజు, కడప జోన ఈడీ చంద్రశేఖర్, ఈడీఈ చంగలరెడ్డి, డీపీటీఓ శ్రీలక్ష్మి, డీఎం గంగాధర్ తదితరులు ఆయనకు ఆహ్వానం పలికారు. గుంతకల్లు, ...
స్త్రీ శక్తి పథకం అత్యద్భుత విజయం
1,500 కొత్త బస్సులు కొనుగోలు చేస్తాం
రెండు నెలల్లో 1,050 ఎలకి్ట్రక్ బస్సులు
ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు
గుంతకల్లు/గుత్తి/ఉరవకొండ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): గుత్తి బస్టాండు, డిపో అభివృద్ధికి రూ.4 కోట్లు మంజూరు చేస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ ఆర్టీసీ బస్టాండ్‌లు, డిపోలను ఆయన గురువారం సందర్శించారు. ఆర్టీసీ రాయలసీమ జోన చైర్మన పూల నాగరాజు, కడప జోన ఈడీ చంద్రశేఖర్, ఈడీఈ చంగలరెడ్డి, డీపీటీఓ శ్రీలక్ష్మి, డీఎం గంగాధర్ తదితరులు ఆయనకు ఆహ్వానం పలికారు. గుంతకల్లు, ఉరవకొండలో కార్మికుల సమావేశం నిర్వహించారు. బస్సుల్లో ప్రయాణించే మహిళలతో మాట్లాడారు. స్త్రీ శక్తి పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉచిత బస్సు పథకం విజయవంతం వెనుక ఆర్టీసీ కార్మికుల శ్రమ ఉందని అన్నారు. కార్మికులు జీరో బ్రేక్ డౌన రికార్డు సాధించాలని సూచించారు. పెరిగిన ఆర్టీసీ ఆక్యుపెన్సీకి తగినట్లుగా కొత్త బస్సు సర్వీసులను ప్రారంభిస్తామని అన్నారు. సీఎం ఆదేశాల మేరకు మరో 1,500 బస్సులను కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎలకి్ట్రక్ బస్సులు 1,050 మంజూరయ్యాయని, మరో రెండు నెలల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తెలంగాణ, కర్ణాటకలో ఉచిత బస్సు పథకాలు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయని, అక్కడి వైఫల్యాలను ఏపీలో అధిగమిస్తూ సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. రోజుకు 40 లక్షల మంది ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్నారని, వీరిలో 25 లక్షల మంది మహిళలు, యువతులు, బాలికలే ఉన్నారని అన్నారు.