CROPS INSPECTING: పొలాలను పరిశీలించిన రెవెన్యూ అధికారులు
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:18 AM
మండలంలోని దొడగట్ట గ్రామానికి చెందిన రైతుల పొలాలను తహసీల్దార్ ఉదయ్‌శంకర్‌రాజు పరిశీలించారు. బుధవారం ఆంధ్రజ్యోతిలో ‘ఓ పట్టాన తెగదే..’ అన్న శీర్షికతో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ చేతన, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ స్పందించి రొద్దం తహసీల్దార్‌తో ఆరాతీశారు.
రొద్దం, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని దొడగట్ట గ్రామానికి చెందిన రైతుల పొలాలను తహసీల్దార్ ఉదయ్‌శంకర్‌రాజు పరిశీలించారు. బుధవారం ఆంధ్రజ్యోతిలో ‘ఓ పట్టాన తెగదే..’ అన్న శీర్షికతో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ చేతన, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ స్పందించి రొద్దం తహసీల్దార్‌తో ఆరాతీశారు. దీంతో తహసీల్దార్, వారి సిబ్బంది రెడ్డిపల్లి రెవెన్యూ పరిధిలోని 284.71 ఎకరాల్లో సాగుచేసిన కందిపంటను పరిశీలించారు. 1951లో ఎవరికి పట్టా ఇచ్చారు, అందులో సభ్యులు ఎంతమంది, ప్రస్తుతం ఎంతమంది ఉన్నారనే అంశాలను ఆరాతీశారు. ల్యాండ్ కాలనైజేషన సొసైటీ కింద ఇచ్చిన రికార్డులను అధ్యక్షుడు చంద్రశేఖర్‌తో పరిశీలించారు. కలెక్టర్, జేసీ ఆదేశాల మేరకు 284.71 ఎకరాలకు సంబంధించిన భూరికార్డులను రొద్దం తహసీల్దార్ కార్యాలయం నుంచి తీసుకుని పుట్టపర్తికి తహసీల్దార్ తరలి వెళ్లారు. పెనుకొండ ఆర్డీఓ ఆనంద్‌కుమార్ సైతం దొడగట్ట భూ వ్యవహారంపై జిల్లా అధికారుల వద్దకు వెళ్లినట్లు సమాచారం. తహసీల్దార్ వెంట రీసర్వే డీటీ చంద్రశేఖర్, ఆర్‌ఐ లక్ష్మీదేవి, వీఆర్‌ఓలు గోపాల్, ఓబులేసు, సర్వేయర్లు పాల్గొన్నారు.