TDP: క్రీడలతో మానసికోల్లాసం
ABN , Publish Date - Sep 19 , 2025 | 11:59 PM
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప, మున్సిపల్ చైర్మన రమేష్ అన్నారు. టీడీపీ నాయకుడు మగ్బూల్ ఆధ్వర్యంలో ఎంజీఎం క్రీడా మైదానంలో నాలుగు రోజులుగా అబ్దుల్‌కాలం క్రికెట్ టోర్నీ నిర్వహించారు.
హిందూపురం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప, మున్సిపల్ చైర్మన రమేష్ అన్నారు. టీడీపీ నాయకుడు మగ్బూల్ ఆధ్వర్యంలో ఎంజీఎం క్రీడా మైదానంలో నాలుగు రోజులుగా అబ్దుల్‌కాలం క్రికెట్ టోర్నీ నిర్వహించారు. శుక్రవారం ఫైనల్స్ కావడంతో సీపీఐ స్టార్స్, టీమ్‌స్పిరిట్ జట్లు తలపడ్డాయి. టీమ్‌స్పిరిట్ జట్టు పది ఓవర్లలో వికెట్ నష్టానికి 131పరుగులు తీసింది. సీపీఐ స్టార్ టీమ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 82పరుగులు చేసింది. విజేతగా నిలిచిన టీమ్‌స్పిరిట్ జట్టుకు రూ.20వేలు, రన్నరప్ జట్టుకు రూ.12,500 మగ్బూల్ అందించారు. కార్యక్రమానికి హాజరైన అంజినప్ప, చైర్మన రమేష్ మాట్లాడుతూ తరచూ ఇలాంటి క్రీడలు నిర్వహించడంవల్ల యువతలో సమైఖ్యతబావం, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు వెంకటేశ, రాష్ట్ర రోడ్డు అభివృద్ధి కార్పొరేషన డైరెక్టర్ చంద్రమోహనయాదవ్, నిర్వాహకులు మగ్బూల్‌బాషా, షాహిద్, తౌసిఫ్ పాల్గొన్నారు.