Babu బాబా జయంతికి ప్రత్యేక నిధులివ్వండి
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:53 PM
సత్యసాయిబాబా జయంత్యుత్సవాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఐటీ, మానవవనరులశాఖామంత్రి నారా లోకేశకు విన్నవించారు. ఆమె రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణితో కలిసి మంత్రి లోకేశను బుధవారం అమరావతిలో కలిశారు.

మంత్రి లోకేశకు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి వినతి
పుట్టపర్తిరూరల్, మార్చి 5 (ఆంద్రజ్యోతి): సత్యసాయిబాబా జయంత్యుత్సవాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఐటీ, మానవవనరులశాఖామంత్రి నారా లోకేశకు విన్నవించారు. ఆమె రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణితో కలిసి మంత్రి లోకేశను బుధవారం అమరావతిలో కలిశారు. ఈ సందర్భంగా ఆమె సత్యసాయిబాబా జయంతిని మానవ వనరుల అభివృద్ధి దినోత్సవంగా ప్రకటించాలని కోరారు. పుట్టపర్తి ఎయిర్‌పోర్టును అన్ని వసతులతో అభివృద్ధి చేయాలన్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ నగరాలకు విమానసర్వీసులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బుక్కపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం నిధులలేమితో నిలిచిపోయిందని, నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై మంత్రి లోకేశ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు.