CPI : వడ్డీ వ్యాపారుల ఆట కట్టించండి
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:48 AM
అధిక వడ్డీ వ్యాపారుల ఆటకట్టించాలని సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు డిమాండ్ చేశారు. సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక జడ్పీ ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహం దగ్గర నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ.. పాతూరు ఒకటో పట్టణ పోలీ్‌సస్టేషన పరిధి ...
ఎస్పీ ఆఫీస్ ఎదుట సీపీఐ ధర్నా
అనంతపురం క్లాక్‌టవర్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): అధిక వడ్డీ వ్యాపారుల ఆటకట్టించాలని సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు డిమాండ్ చేశారు. సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక జడ్పీ ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహం దగ్గర నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ.. పాతూరు ఒకటో పట్టణ పోలీ్‌సస్టేషన పరిధి లో బంగారు షాపులో పనిచేస్తున్న మైనార్టీ యువకుడిపై వడ్డీ వ్యాపారులు దాడి చేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పోలీసు ల వైఫల్యమని విమర్శించారు. బుక్కరాయసముద్రానికి చెందిన ఆటోడ్రైవర్ బాలకృష్ణ ఉదంతం, సెంట్రల్
బ్యాంకు ఉద్యోగి రూ.35వేల రుణానికి రూ.1.2లక్షల వడ్డీ చెల్లించి, ఆత్మహత్య ఘటనలు వడ్డీ వ్యాపారుల దారుణాలకు నిదర్శనాలన్నారు. వడ్డీ మాఫియా నగరంలో రోజురోజుకీ చెలరేగిపోతోందన్నారు. అధిక వడ్డీ మాఫియాపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు లింగమయ్య, రమణ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సంతో్‌షకుమార్, పార్వతి, పద్మావతి, రాజేష్, కుళ్లాయిస్వామి, కృష్ణుడు, అల్లీపీరా, ఎల్లుట్ల నారాయణస్వామి, బంగారు బాషా, రాజుప్రసాద్, యశోదమ్మ, శ్రీనివాస్, మంజునాథ్, ఆనంద్ పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..