MINISTER SAVITHA: అభివృద్ధిని ప్రజలకు తెలపాలి
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:42 PM
కూటమి ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ పథకాలు తదితర అభివృద్ధి పనులను ప్రజలకు విరవించడమే ఽఽఽధేయ్యంగా పనిచేయాలని మంత్రి సవిత సూచించారు. గోరంట్లలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు.
గోరంట్ల, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ పథకాలు తదితర అభివృద్ధి పనులను ప్రజలకు విరవించడమే ఽఽఽధేయ్యంగా పనిచేయాలని మంత్రి సవిత సూచించారు. గోరంట్లలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. పరిశీలకులుగా జీవీ ఆంజనేయులు, నరసింహరాయల్ హాజరయ్యారు. ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసినా ప్రతిపక్షాలు విషం చిమ్మే ప్రయత్నంచేస్తున్నాయని మంత్రి అన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభ 10న అనంతపురంలో జరుగుతోందని, సభకు సీఎం, డిప్యూటీ సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారన్నారు. కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. కూటమి నాయకులు బాలక్రిష్ణ చౌదరి, లక్ష్మీనారాయణ, సంతోష్, సోముశేఖర్, నాగేనాయక్, పచ్చ అశోక్, నిమ్మల విద్యాధరణి, చంద్ర, శ్రీధర్, జయచంద్ర, గోపాల్‌రెడ్డి, రమణ, శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.
సూపర్‌హిట్ సభను విజయవంతం చేద్దాం
పెనుకొండ టౌన: సూపర్‌సిక్స్ సూపర్‌హిట్ బహిరంగ సభను విజయవంతం చేద్దామని మంత్రి సవిత పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ పరిశీలకుడు నరసింహారావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ అనంతపురంలో బుధవారం భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నామని, సభకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. మార్క్‌ఫెడ్ చైర్మన బంగారురాజు, మాధవనాయుడు, మాజీ జడ్పీటీసీ నారాయణస్వామి, గుట్టూరు శ్రీరాములు, టైలర్ ఆంజనేయులు, సింగిల్‌విండో అధ్యక్షుడు పోతిరెడ్డి, కన్వీనర్ శ్రీరాములు, నారాయణస్వామి, నాగార్జున, రమణమ్మ పాల్గొన్నారు.
ఎన్టీఆర్‌ను సీఎం చేసిన ఘనత పరిగిదే..
పరిగి(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత నందమూరి తారకరామారావును ముఖ్యమంత్రిని చేసిన ఘనత పరిగి మండలందేనని మంత్రి సవిత అన్నారు. సోమవారం బీరలింగేశ్వర కళ్యాణమండపంలో కన్వీనర్ గోవిందరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ అనంతపురంలో బుధవారం సూపర్‌సిక్స్ సూపర్‌హిట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. అబ్జర్వర్ నరసింహారావు, సర్పంచ బాలాజీ, జిల్లా యువత కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, సోమప్ప, ఏపీలైవ్‌స్టాక్ కార్పొరేషన డైరెక్టర్ వెంకటేశ, వడ్డె హనుమయ్య, సింగిల్‌విండో అధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి పాల్గొన్నారు.