Share News

clay Ganesha మట్టి వినాయకుడిని పూజించాలి

ABN , Publish Date - Aug 19 , 2025 | 01:17 AM

త్వరలో జరిగే వినాయక చతుర్థికి మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ప్రజలకు సూచించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో సోమవారం ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా పర్యావరణ అనుకూల వినాయ క చవితి అవగాహన కార్యక్రమంలో భాగంగా సహజ వనరులతో చేసిన మట్టి ప్రతిమలతో పర్యావరణ అనుకూల వినాయక చవితిని జరుపుకుందాం అనే కరపత్రాలను కలెక్టర్‌ ఆవిష్కరించారు.

 clay Ganesha మట్టి వినాయకుడిని పూజించాలి

- కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సూచన

అనంతపురం కలెక్టరేట్‌/టౌన, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): త్వరలో జరిగే వినాయక చతుర్థికి మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ప్రజలకు సూచించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో సోమవారం ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా పర్యావరణ అనుకూల వినాయ క చవితి అవగాహన కార్యక్రమంలో భాగంగా సహజ వనరులతో చేసిన మట్టి ప్రతిమలతో పర్యావరణ అనుకూల వినాయక చవితిని జరుపుకుందాం అనే కరపత్రాలను కలెక్టర్‌ ఆవిష్కరించారు.


అనంతరం మాట్లాడుతూ... వినాయక చవితి విశిష్టతను కాపాడుకునేందుకు అంద రూ సమష్టిగా కృషి చేయాలన్నారు. మట్టి ప్రతిమలతో వినాయక చవి తిని జరుపుకోవాలన్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను వినియోగం చకూడదని తెలిపారు. చెరువులు, జలవనరులకు నష్టం కలిగించే వ్యర్థ పదార్థాల వినియోగాన్ని పూర్తిగా మానేయాలన్నారు. మట్టితో చేసిన ప్రతిమలను మాత్రమే వాడాలని, విగ్రహాల తయారీకి సహజసిద్ధ్దమైన రంగులను ప్రకృతిలో లభ్యమయ్యే పత్తి, నార వంటి పదార్థాలను వినియోగించాలని సూచించారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారి్‌స(పీఓపీ) విగ్రహాల వాడకం నిషేఽధమని, ప్రతిఒక్కరూ గ్రహించాలని అన్నారు. సుప్రీంకోర్టు, నేషనల్‌ గ్రీన ట్రిబ్యునల్‌ ఆదేశాలకు అనుగుణంగా విగ్రహాల తయారీ, నిమజ్జన కార్యక్రమం జరగాలన్నారు. వినాయక మండపాలు, విగ్రహాల ఏర్పాటు సమయాల్లో రెవెన్యూశాఖ, నగరపాలక సంస్థ, జిల్లా పంచాయతీశాఖ, అగ్నిమాపకశాఖ, పోలీసుశాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ శివనారాయణశర్మ, డీఆర్‌ఓ మలోలతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Aug 19 , 2025 | 01:17 AM