GREVEINCE: ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికకు అధికారుల డుమ్మా
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:13 AM
ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారవేదికకు పలుశాఖల అధికారులు డుమ్మాకొడుతున్నారు. తహసీల్దార్ సౌజన్యలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం రెవెన్యూ కార్యాలయంలో గ్రీవెన్సను నిర్వహించారు. మండలంలోని గ్రామాల నుంచి ప్రజలు తమ సమస్యలను విన్నవించడానికి ఆయాశాఖల అధికారులు ఉంటారన్న నమ్మకంతో ఎన్నో కష్టాలను ఓర్చుకుని కార్యాలయానికి వస్తున్నారు.
లేపాక్షి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారవేదికకు పలుశాఖల అధికారులు డుమ్మాకొడుతున్నారు. తహసీల్దార్ సౌజన్యలక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం రెవెన్యూ కార్యాలయంలో గ్రీవెన్సను నిర్వహించారు. మండలంలోని గ్రామాల నుంచి ప్రజలు తమ సమస్యలను విన్నవించడానికి ఆయాశాఖల అధికారులు ఉంటారన్న నమ్మకంతో ఎన్నో కష్టాలను ఓర్చుకుని కార్యాలయానికి వస్తున్నారు. సంబంధిత అధికారులు లేకపోవడంతో నిరుత్సాహంగా వెనుతిరుగుతున్నారు. కోట్లరూపాయల నిధులను వెచ్చించి మండలంలో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లను వేస్తున్నారు. ఆ శాఖకు సంబంధించి మండల స్థాయి ఇంజనీర్ డుమ్మాకొట్టారు. చెరువుల్లో అక్రమంగా మట్టితోలుతూ కొంతమంది చెరువులను కబ్జాచేసి అక్రమంగా పంటలను సాగుచేస్తున్నా, వాటిని కట్టడి చేయాల్సిన సిబ్బంది సైతం కనిపించలేదు. ఎక్సైజ్‌శాఖ, అటవీశాఖ అధికారులు ఎప్పుడూ డుమ్మాకొడుతున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజా పరిష్కార వేదికకు డుమ్మాకొట్టిన అధికారులపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఎంపీడీఓ నరసింహమూర్తి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.