MLA NBK: పురం భవిష్యత్తుకు పునాది వేసింది ఎన్టీఆరే
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:08 AM
హిందూపురం భవిష్యత్తుకు పునాది వేసింది నందమూరి తారకరామారావని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా మూడోరోజు సోమవారం మండలంలోని కె.బసవనపల్లిలో రూ.64లక్షలతో నిర్మించిన అదనపు తరగతిగది, లైబ్రెరీని ప్రారంభించారు.
చదువు విలువ ఇప్పుడు తెలుస్తోంది
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
హిందూపురం, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): హిందూపురం భవిష్యత్తుకు పునాది వేసింది నందమూరి తారకరామారావని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా మూడోరోజు సోమవారం మండలంలోని కె.బసవనపల్లిలో రూ.64లక్షలతో నిర్మించిన అదనపు తరగతిగది, లైబ్రెరీని ప్రారంభించారు. బసవనపల్లి నుంచి లయోలా పాఠశాలకు వెళ్లే రూ.1.5కోట్లతో తారురోడ్డును ప్రారంభించారు. పట్టణంలోని కస్తూర్బా పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం పట్టణంలో జరిగిన జీఎస్టీ ర్యాలీలో పాల్గొన్నారు. బసవనపల్లిలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ హిందూపురం ప్రాంతంలో పరిశ్రమలు, నవోదయ పాఠశాల, గురుకుల పాఠశాలలు స్థాపించడంలో ఎన్టీఆర్ తీసుకున్నచొరవ మరువలేనిదన్నారు. ఆ రోజుల్లోనే చదువుపట్ల ఉన్నశ్రద్ద ఆయనకు ఏపాటిదో అర్థం అవుతుందన్నారు. అంత శ్రద్ధగా చదివేవాడిని కాను, అయినా డిగ్రీపూర్తీచేసి సినీరంగంలోకి వచ్చానన్నారు. చదువు విలువ ఎమిటో ఇప్పుడు తెలుసొచ్చిందన్నారు. తాను తీసే సినిమాల్లో సమాజానికి ఉపయోగపడే సన్నివేశాలతోపాటు విద్యార్థులకు సందేశాలుంటాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బేవనహళ్లి ఆనంద్ అందించిన క్రీడా పరికరాలను ఎమ్మెల్యే అందజేశారు. వాణిజ్యపన్నులశాఖ డిప్యూటీ కమిషనర్ భాస్కరవల్లి, హిందూపురం వాణిజ్యపన్నులశాఖ అధికారి కృష్ణవేణి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప, మున్సిపల్ చైర్మన రమేష్, మార్కెట్‌యార్డ్, చైర్మన అశ్వత్థనారాయణరెడ్డి, వాల్మీకి కార్పొరేషన డైరెక్టర్ బేవనహళ్లి ఆనంద్, నాయకులు నాగరాజు, హెచఎన రాము, కొల్లకుంట శివశంకర్, మంజునాథ్, ఆంజనేయులు పాల్గొన్నారు.
అన్ని సమస్యలు పరిష్కరిస్తాం: నియోజకవర్గంలోని సమస్యలన్నింటినీ ఒక్కొక్కటే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అ న్నా రు. సోమవారం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పలువురు బాలకృష్ణను కలిశారు. చేనేత కార్మికులు కలిసి 200యూనిట్లు ఉచిత విద్యుతను అమలు చేయాలని కోరారు. మరికొంతమంది ఇంటి స్థలాలు, పిం ఛన్లు, భూ స మస్యలు పరిష్కరించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప, మున్సిపల్ చైౖర్మన రమేష్, కన్వీనర్లు రాము, వెంకటేశ, కార్పొరేషన డైరెక్టర్లు, బేవనహళ్లి ఆనంద్, చంద్రమోహన, పరిమళ, గంగాధర్, నాగరాజు, అమర్నాథ్, డైమండ్‌బాబా, మంజునాథ్, చక్కీరప్ప, రమేష్ పాల్గొన్నారు.